రేవంత్ రెడ్డి కాస్త రేవంత్ గౌడ్ గా ఎలా మారారు ?
రేవంత్ రెడ్డిని గౌడ్ గా పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మార్చేశారు;
ఎనుముల రేవంత్ రెడ్డి ఒక్కసారిగా రేవంత్ గౌడ్ గా మారిపోయారు. రేవంత్ రెడ్డి ఒక్కసారిగా రేవంత్ గౌడ్ గా ఎలా మారిపోయారు ? ఎక్కడైనా ప్రకటనల్లో అచ్చుతప్పు పడిందా ? లేకపోతే పొరబాటున ఎవరైనా తనపేరును రేవంత్ గౌడ్(Revanth Goud) గా చెప్పారా ? అదేమీలేదు, పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్(PCC President Bomma Mahesh) ఒక సమావేశంలో రేవంత్ రెడ్డిని రేవంత్ గౌడ్ అని సంభోదించారు. ముందు సభలోని జనాలు ఆశ్చర్యపోయినా తర్వాత బొమ్మ చెప్పిన వివరణ విని అందరు చప్పట్లుకొట్టారు.
ఇంతకీ విషయం ఏమిటంటే సర్వాయి పాపన్న జయంతి సందర్భంగా జరిగిన సమావేశంలో బొమ్మ మాట్లాడుతు రేవంత్ రెడ్డిని రేవంత్ గౌడ్ అని సంభోదించటంతో ముందు అందరు ఆశ్చర్యపోయారు. అదేమిటి రేవంత్ రెడ్డిని పట్టుకుని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ గౌడ్ అని అన్నారు అని హాస్చర్చపోయారు. అక్కడే వేదిక మీద రేవంత్ తో పాటు కూర్చున్న ముఖ్యఅతిధులు కూడా బొమ్మ సంభోదనకు చాలా ఆశ్చర్యపోయారు. బీసీల సంక్షేమానికి రేవంత్ చేస్తున్న సేవలు, తీసుకుంటున్న నిర్ణయాలను చూసిన తర్వాత రేవంత్ రెడ్డిని రేవంత్ గౌడ్ అనటంలో తప్పేలేదని తన సంభోదనను సమర్ధించుకోవటంతో సమావేశంలోని వాళ్ళంతా హర్షం ప్రకటించారు. రేవంత్ ముసిముసిగా నవ్వుకున్నారు. రేవంత్ ఆధ్వర్యంలో కులగణనచేయటం దేశంలోనే ఒక చరిత్రగా బొమ్మ చెప్పారు.
కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కూడా కులగణన చేయటానికి ముఖ్యమంత్రులు సాహసించలేదన్నారు. అలాగే బీసీలకు స్ధానికసంస్ధల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కూడా గొప్పదన్నారు. బీసీల సంక్షేమానికి రేవంత్ తీసుకున్న పైరెండు నిర్ణయాలు బీసీ సమాజాన్ని ఎంతో ఆకట్టుకున్నాయని బొమ్మ అన్నారు. కర్నాటకలో బీసీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యే ఉన్నప్పటికీ అక్కడ స్ధానికఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచాలన్న నిర్ణయాన్ని తీసుకోలేకపోయినట్లు గుర్తుచేశారు. రేవంత్...రెడ్డి అయ్యుండి కూడా బీసీల అభివృద్ధికి ఇంతచేస్తున్న కారణంగా రేవంత్ ను రేవంత్ గౌడ్ అనటంలో తప్పేలేదన్నారు.