భారీ వర్షాలు–వినాయక మండపాల వద్ద జాగ్రత్తగా ఉండాలి
బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, దీని వల్ల ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయిని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.;
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసి వినాయక మండపాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. బంగాళాఖాతంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఆ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కృష్ణా జిల్లాలో అయితే బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
తక్కిన జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంతేకాకుడా అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్న నేపథ్యంలో సముద్ర తీరం వెంబడి 40–60కిమీ వేగంతో ఈదురుగాలులు వీచీ అవకాశాలు ఉన్నాయని, దీంతో మత్స్యకారులు వేటకు వెళ్ళారాదని, ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్‌జైన్ తెలిపారు.