సుప్రీం కోర్టు తీర్పుతో ఏఆర్ డెయిరీ ఎండీ పిటిషన్‌పై విచారణ వాయిదా
లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యిని సరఫరా చేశారనే అభియోగంపై ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ఎండీ రాజశేఖరన్ పై టీటీడీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
Byline : Vijayakumar Garika
Update: 2024-10-05 03:11 GMT
తిరుపతి తిరుమల లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఎండీ రాజశేఖరన్ బెయిల్ పిటీషన్ విచారణ ఈ నెల 17కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వాయిదా వేసింది.
తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదం తయారీకి కల్తీ నెయ్యిని సరఫరా చేశారనే అభియోగంపై తమిళనాడుకు చెందిన ఏఆర్ డెయిరీ ఫుడ్స్ ప్రైవేటు లిమిటెడ్ సంస్థ ఎండీ రాజశేఖరన్ పై టీటీడీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దీంతో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఏఆర్ డెయిరీ ఎండీ రాజశేఖరన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ శుక్రవారం విచారణకు వచ్చింది. అయితే లడ్డూ వివాదంపై శుక్రవారం సుప్రీం కోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో ఎండీ రాజశేఖరన్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను ఈ నెల 17వ తేదీకి హైకోర్టు వాయిదా వేసింది.