విశాఖ, విజయవాడ మెట్రోకు వేగం – జాయింట్ వెంచర్లకు గ్రీన్ సిగ్నల్

సింగిల్ టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్ల వెనకడుగు వేశారు. దీంతో కాంట్రాక్టర్ల అభ్యర్థన మేరకు ప్రభుత్వం వ్యూహం మార్చింది.

Update: 2025-09-27 12:29 GMT
విశాఖ, విజయవాడ మెట్రో రైల్వే ప్రాజెక్టులకు సింగిల్ టెండర్లు వేయడానికి కాంట్రాక్టర్ల వెనకడుగు వేశారు. దీంతో కాంట్రాక్టర్ల అభ్యర్థన పేరిట ప్రభుత్వం వ్యూహం మార్చింది. భారీ మొత్తంలో కాంట్రాక్టులు ఉండడం, హైదరాబాద్ మెట్రో ప్రాజెక్ట్ అనుభవంతో ఒకే టెండర్ వేయడానికి L&T వంటి ప్రముఖ కాంట్రాక్ట్ సంస్థలు కూడా వెనుకాడాయి. ప్రీ-బిడ్ మీటింగ్‌లో చాలా కంపెనీలు స్పష్టంగా “సింగిల్‌గా చేయలేం” అని తేల్చిచెప్పాయి.

దీంతో ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (APMRCL) విజయవాడ, విశాఖపట్నం మెట్రో టెండర్లలో ఇకపై జాయింట్ వెంచర్లను (JVs) కూడా అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించింది. ప్రీ-బిడ్ సమావేశంలో అనేక కాంట్రాక్టింగ్ కంపెనీలు ఈ విజ్ఞప్తి చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నాట్టు తెలిసింది.

APMRCL మేనేజింగ్ డైరెక్టర్ ఎన్‌.పి. రామకృష్ణ రెడ్డి చెప్పిన దాని ప్రకారం సివిల్ వర్క్స్‌లో 40 శాతం పనులకు అంతర్జాతీయ టెండర్లు పిలిచారు. ఈ టెండర్లు విశాఖలో 46.23 కి.మీ, విజయవాడలో 38 కి.మీ పరిధిని కవర్ చేస్తాయి. రెండు, మూడు కంపెనీలు కలిసి JV రూపంలో బిడ్ వేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
అయితే ప్యాకేజీలను చిన్న చిన్నగా విభజించడం జరగదని, అలా చేస్తే వ్యయం పెరిగి ప్రాజెక్టు ఆలస్యం అవుతుందన్నారు. “2028 నాటికి ప్రాజెక్టులు పూర్తి చేయాలన్నది లక్. ప్యాకేజీలు విభజిస్తే ఖర్చులు పెరుగుతాయి,” అని ఆయన వివరించారు. కలయిక ప్రభుత్వం రెండు నగరాల్లో మెట్రో రైలు వ్యవస్థలను అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ రెండు ప్రాజెక్టుల అంచనా వ్యయం కలిపి ₹21,616 కోట్లు, అందులో విశాఖకు ₹11,498 కోట్లు, విజయవాడకు ₹10,118 కోట్లు కేటాయించనున్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 50:50
ఈ ప్రాజెక్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమానంగా (50:50) నిధులతో నిర్మాణ కానున్నాయి. విశాఖ మెట్రోకు VMRDA ₹4,101 కోట్లు, విజయవాడ మెట్రోకు CRDA ₹3,497 కోట్లు కేటాయించనున్నాయి. మిగతా మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం భరాయిస్తుంది.
ప్రాజెక్టు వివరాలు
విశాఖపట్నం మెట్రో: 76.9 కి.మీ, మూడు కారిడార్లు, సుమారు 54 స్టేషన్లు.
విజయవాడ మెట్రో: 38.9 కి.మీ, రెండు కారిడార్లు. గన్నవరం నుండి PNBS, PNBS నుండి పెనమలూరు. మొత్తం 33 స్టేషన్లు, వీటిలో ఒక అండర్‌గ్రౌండ్ స్టేషన్ ఉంటుంది. 4.7 కి.మీ డబుల్-డెక్కర్ ఫ్లైఓవర్ కూడా ఉంటుంది.

విజయవాడ మెట్రో మొదటి దశలో కారిడార్ 1A (గన్నవరం–PNBS, 22 కి.మీ), కారిడార్ 1B (PNBS–పెనమలూరు, 11 కి.మీ) ఉంటాయి. భూసేకరణ ప్రక్రియ ప్రస్తుతం కొనసాగుతోంది.
టెండర్ గడువులు పొడిగింపు
కాంట్రాక్టింగ్ కంపెనీల అభ్యర్థనలతో APMRCL టెండర్ సమర్పణ గడువులను పొడిగించింది.
విజయవాడ మెట్రో: గడువు అక్టోబర్ 14 వరకు.
విశాఖపట్నం మెట్రో: గడువు అక్టోబర్ 7 వరకు.
కాంట్రాక్టర్లు వెనకడుగు వేయడంతో ఇప్పటికే రెండు సార్లు గడువులు పొడిగించాల్సి వచ్చింది. అయినా రెస్పాన్స్ రాలేదు. పరిస్థితిని గుర్తించిన ప్రభుత్వం ఇప్పుడు జాయింట్ వెంచర్లకు అనుమతించింది. మూడు కంపెనీలు కలసి బిడ్ వేసుకోవచ్చని చెప్పడం ద్వారా రిస్క్ షేర్ చేయడం, పెట్టుబడులు పంచుకోవడం సులభం అవుతుంది. దీంతో పలువురు ముందుకు రావొచ్చని భావిస్తోంది.
2028 నాటికి మెట్రో రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయాలంటే ఇప్పటి నుంచే పనులు మొదలు పెట్టాల్సి ఉంది.
ఇప్పటి వరకు ఏమి జరిగిందీ?
ఆంధ్రప్రదేశ్‌లో విజయవాడ, విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులు చాలా కాలంగా ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. అమరావతి రాజధాని ప్రణాళికలో భాగంగా ఇవి కీలకమైనవిగా భావించారు.
ఏమి జరగబోతోంది?
JVల అనుమతితో అంతర్జాతీయ + దేశీయ కంపెనీలు కలసి బిడ్ వేయగలవు.
కేంద్ర–రాష్ట్రం 50:50 ఖర్చు పంచుకోవడం వల్ల నిధుల సమస్య కొంత తగ్గవచ్చు.
2028 లక్ష్యం కాగలదనే ఆశతో ప్రభుత్వం ముందడుగు వేసింది.
సవాళ్లు
₹21,616 కోట్ల భారీ వ్యయం → నిధుల సమీకరణే ప్రధాన సవాల్.
భూసేకరణ ఆలస్యం, ప్రత్యేకించి విజయవాడలో నగర మధ్య ప్రాంతాల్లో.
JVలు వచ్చినా ఖర్చులు పెరగడం తప్పదు.
వాస్తవ అంచనా
హైదరాబాద్ మెట్రో అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని చూస్తే 2028 నాటికి పూర్తి అవుతుందని ఊహించలేం. హైదరాబాద్ మెట్రో ప్రారంభ వ్యయం: ₹14,132 కోట్లు. చివరికి అయిన ఖర్చు: ₹20,000 కోట్లకు పైగా. హైదరాబాద్ మెట్రో మొదట 5 ఏళ్లు అనుకుంటే 10 ఏళ్లు పట్టింది. L&T Metro (PPP మోడల్) హైదరాబాద్ ప్రాజెక్ట్ ను పూర్తి చేసింది. ఇప్పుడా సంస్థ కూడా ఏపీలో టెండర్లు వేయడానికి వెనుకాడుతోందని సమాచారం.
Tags:    

Similar News