BREAKING | లారీని ఢీకొన్న వ్యాన్..నలుగురి మృతి
శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఇంటికి చేరేలోపు నలుగురు కాటికి వెళ్లారు. ఇంకొందరు గాయపడ్డారు.
కుటుంబ సభ్యులు, బంధువులు. అంతా కలిసి తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. ఆ ఆనందంలో శుక్రవారం రాత్రి మినీవ్యాన్ లో ఇళ్లకు బయలుదేరారు. ఇంకొన్ని గంటల్లో ఇంటికి చేరబోతున్నారు. జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఈ యాత్రికుల ప్రయాణిస్తున్న మినీ వ్యాన్ ఢీకొంది. శనివారం వేకువజామున జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించగా, ఇంకొంతమంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం అందింది. గాయపడిన కొందరిని బెంగళూరు ఆసుపత్రికి చికిత్సకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదం జరిగిన నేపథ్యంలో జాతీయ రహదారిపై ట్రాఫిక్ కూడా స్తంభించింది. సమాచారం అందుకున్న పోలీసులు, బాధితులను ఆస్పత్రులకు తరలించడానికి సహకారం అందించినట్లు తెలుస్తోంది.
అనంతపురం జిల్లా మడకశిర మండలం బుల్లసముద్రం వద్ద శనివారం వేకువ జామునజరిగిన రోడ్డు ప్రమాద సంఘటన వివరాలు ఇవి.