టీటీడీ బర్డ్ ఆస్పత్రికి భారీ విరాళం

రెండు కోట్ల రూపాయల చెక్కు అందించిన పారిశ్రామికవేత్త రోషణీ నాడార్

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-11-18 16:16 GMT

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత టీటీడీ నిర్వహిస్తున్న ట్రస్టులకు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. అందులో మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదాన ట్రస్టుతో పాటు ఎస్వీ ప్రాణదానం, బర్డ్ (Balaji Institute of Surgery, Research and Rehabilitation for the Disabled BIRRD) ట్రస్టులకు కోట్లాది రూపాయలు విరాళాలు అందాయి.

తిరుమలలో మంగళవారం రాత్రి టీటీడీకి హెచ్.సి.ఎల్. టెక్నాలజీస్ చైర్ పర్సన్ రోషణి నాడర్ టీటీడీ బర్డ్ ట్రస్టుకు రెండు కోట్ల రూపాయలు విరాళం అందించారు. ఆ చెక్కును తిరుమలలో టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడుకు అందించారు.

బర్డ్ ఆస్పత్రి
తిరుపతి కేంద్రంగా తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) అనేక విద్యాసంస్థల తో పాటు ఆసుపత్రులు కూడా నిర్వహిస్తోంది. అందులో కీలకమైనది బాలాజీ వికలాంగుల, శస్త్ర చికిత్స, పునరావాస కేంద్రం. వికలాంగుల సేవ కోసం 1994లో బర్డ్ ఆసుపత్రి ఏర్పాటు చేశారు. ఈ
ఆస్పత్రిలో వైకల్యంతో బాధ పడే రోగులతో పాటు, కృత్రిమ కాళ్లను అమర్చడానికి కీలకమైన ఆపరేషన్లు చేయడంలో బర్డ్ ఆస్పత్రి పేదరోగులకు సేవలు చేయడంలో విశిష్ట సేవలు అందిస్తోంది. ఇక్కడ కృత్రిమ అవయవాల తయారీ, పరిశోధన కేంద్రం స్థాయికి బర్ఢ్ ఆసుపత్రి ఎదిగింది.
ఈ ఆస్పత్రికి వచ్చే వికలాంగులైన పేద రోగులకు కొత్తజీవితం ప్రసాదించాలని కోరుతూ హెచ్.సి.ఎల్. టెక్నాలజీస్ చైర్ పర్సన్ రోషణి నాడార్ రెండు కోట్ల రూపాయల చెక్కును శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడుకు అందించారు. ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు శ్రీవారి దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో ఆశీర్వచనాలు, శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు.
Tags:    

Similar News