Road Terror | చిత్తూరు వద్ద బోల్తా పడిన బస్సు

నలుగురు మృతిచెందగా, 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదంపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి స్పందించారు.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-01-17 04:20 GMT

చిత్తూరు సమీపంలోని గంగాసాగరం వద్ద నిలిపి ఉన్న టిప్పర్ తప్పించే యత్నంలో  ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత శుక్రవారం వేకువజామున రెండు గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఈ ప్రమాదంలో నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించారు. మరో 22 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరిని చిత్తూరు జనరల్ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న వారిని తమిళనాడులో ని వేలూరు సిఎంసి ఆసుపత్రికి తరలించారు.

చిత్తూరు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగిన సమాచారం తెలిసిన వెంటనే, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్పందించారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించడం లోనే కాకుండా, సహాయక చర్యలు తీసుకోవడంలో కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.
గాఢ నిద్రలోనే...

తిరుపతి నుంచి మధురై ప్రయాణికులతో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. నడిరేయి కావడంతో అంతా గాఢ నిద్రలో ఉన్నారు. చిత్తూరు దాటిన తర్వాత బస్సు ప్రయాణం జాతీయ రహదారిపై సాగుతోంది. గంగా సాగరం వద్ద తాత్కాలిక రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రోడ్డు నిర్మాణానికి అవసరమైన మెటీరియల్ తీసుకువచ్చిన టిప్పర్ రోడ్డు పక్కన నిలిపి ఉన్నారు. చలికాలం కావడం వల్ల, మంచు ఎక్కువగా ఉండడంతో, మితిమీరిన వేగంతో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ కోసం సమీపంలోకి వెళ్లే వరకు నిలిపి ఉన్న టిప్పర్ను గమనించలేదని తెలిసింది.
టిప్పర్ ను తప్పించే యత్నంలో..
ఆ ట్రిప్పర్ను తప్పించే యుద్ధంలో ప్రైవేట్ బస్సు డివైడర్ను ఢీ కొట్టి రోడ్డుకు అడ్డంగా బోల్తా పడినట్లు ప్రత్యక్ష సాక్షుల కథనం. దీంతో గాఢ నిద్రలో ఉన్న వారందరూ ఆందోళన గురయ్యారు. అంధకారంలో ఏం జరుగుతుందనేది తెలియని స్థితిలో ప్రాణ భయంతో కేకలు వేశారు. బస్సు పడిన ధాటికి పెద్ద శబ్దం ఆ ప్రాంతాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రమాద స్థలికి దగ్గరలో ఉన్న కార్మికులు కొందరు అప్రమత్తమై బస్సులో చిక్కుకున్న వారిని బయటికి తీసేందుకు సహకారం అందించడంతోపాటు 108 అంబులెన్స్లకు కూడా సమాచారం అందించినట్లు తెలిసింది.
కలెక్టర్ సహాయక చర్యలు

చిత్తూరు పోలీసుల నుంచి ఈ సమాచారం అందుకున్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ గట్ల స్థలాన్ని సందర్శించారు. ఘటనా స్థలిలో సహాయక చర్యలు తీసుకున్నారు.  గాయపడిన వారిలో కొందరిని చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రిలోనే ఉన్న ఆయన క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించడానికి వీలుగా శ్రద్ధ తీసుకున్నారు. వైద్యాధికారులకు కూడా ఆయన సూచనలు చేశారు. 
నలుగురు మృతి
ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, 22 మంది గాయపడినట్లు సమాచారం అందింది. వారిలో ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న కొందరిని తమిళనాడులోని వేలు సిఎంసి ఆసుపత్రికి తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న వారి వివరాలు తెలియలేదు. ఈ ప్రమాదంలో మరణించిన కారణం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చరికి తరలించారు. చిత్తూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ ఘటనపై రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, చిత్తూరు జిల్లా ఇన్చార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి స్పందించారు.
చిత్తూరు సమీపంలోని గంగసాగరం వద్ద రోడ్డు ప్రమాద ఘటన బాధాకారం అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన సంతాపం తెలిపారు, విషమ పరిస్థితిలో ఉన్న వారికి మెరుగైన వైద్యం అందిచాలని ఆయన చిత్తూరు జిల్లా వైద్యాధికారులకు సూచించారు. వాహనదారులు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
Tags:    

Similar News