మంత్రిని దొంగ అన్నాడని మాజీ ఎమ్మెల్యే అరెస్ట్

రాయచోటి నుంచి మదనపల్లి కు విస్తరించిన హై టెన్షన్;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-07-21 09:13 GMT
మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడిన వైసీపీ శ్రేణులు

చిత్తూరు జిల్లా మదనపల్లి పట్టణంలో హై టెన్షన్ వాతావరణం ఏర్పడింది.

అన్నమయ్య జిల్లా రాయచోటి రాజకీయం మదనపల్లెకు చేరింది. మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డిని ఆదివారం రాత్రి అరెస్టు చేశారు. అనేక పోలీస్ స్టేషన్లో చుట్టూ తిప్పిన ఆయనను సోమవారం వేకువజామున మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు.
"సీఎం ఎన్ చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం. రాయచోటి ఎమ్మెల్యే, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి దొంగ" అని మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించడంపై కేసు నమోదయింది. ఆయన అరెస్టు గోప్యంగా ఉంచారు. 
రాయచోటి పట్టణంలో ఈ విషయం తెలియడంతో వైసిపి నాయకులు మదనపల్లెకు తరలివచ్చారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే, ఎంఎల్సీ , వైసీపీ శ్రేణులు కూడా జత కలిశారు.
మదనపల్లె రూరల్ పోలీస్ స్టేషన్లో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఆర్. రమేష్ కుమార్ రెడ్డి ని కలవడానికి ఎవరిని అనుమతించ లేదు. దీంతో రాయచోటి మదనపల్లె ప్రాంతాలకు చెందిన వైసీపీ శ్రేణులు భారీగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నాయి. జోరుగా కురుస్తున్న వర్షం లోను వారంతా అక్కడే నిరీక్షిస్తున్నారు.

మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి (మధ్యలో ఉన్న వ్యక్తి)తో మాట్లాడుతున్న మదనపల్లె మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి

"ఇకపై గాలి పీల్చారు" అని ఫిర్యాదు చేసిన పోలీసులు కేసులు నమోదు చేసేటట్లు ఉన్నారని మదనపల్లె మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి నిరసన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఈ తరహా కేసులు వాంఛనీయం కాదని ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు.
2024 ఎన్నికల్లో టిడిపి టికెట్ కోసం చివర వరకు ప్రయత్నించిన లకిరెడ్డి పల్లె మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఈ వ్యవహారంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ కుమార్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు.
ఇంతకీ కేసు ఏమిటి?
రాష్ట్రంలో వైసిపి నేతలు మాటల దాడులు సాగిస్తున్నారు. మేము కూడా తగ్గేది లేదని పార్టీ శ్రేణుల ద్వారా టిడిపి నేతలు పెట్టిస్తున్న కేసులతో వైసిపి నేతలకు కేసులు చుట్టూముడుతున్నాయి. ఆ కోవలోనే ఆ కోవలోనే..
అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి నియోజకవర్గంలో కూడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వైసిపి మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్ రెడ్డి, ఆర్ రమేష్ కుమార్ రెడ్డి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. రెండు రోజుల కిందట చిన్నమండెం మండలం కదిరి వాళ్ళ పల్లెలో మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి మాట్లాడుతూ,
"కూటమి ఎమ్మెల్యేలలో దోపిడీ చేయని వారు ఎవరున్నారు చెప్పాలి. ప్రతి పల్లెలో నాలుగు బెల్ట్ షాపులు నిర్వహిస్తూ పేదలను అప్పుల పాలు చేస్తున్నారు. సీఎం కక్ష సాధింపుగా వ్యవహరిస్తున్నారు. ఆయన చెప్పే మాటలు నమ్మవద్దనీ మాజీ సీఎం వైయస్ జగన్ పదేపదే చెప్పిన చిన్న మండలంలో ఓ దొంగకు 4 మెజార్టీ ఇచ్చారు. ఏదో అయిపోతుందని చివరకు ఓ దొంగను తెచ్చారంటూ" రమేష్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయనపై కేసు నమోదుకు దారి తీసాయి.
ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ లక్కిరెడ్డిపల్లి చెందిన టిడిపి నేత మదన్ మోహన్ రెడ్డి అక్కడ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో పాటు నియోజకవర్గంలోని లక్కిరెడ్డిపల్లి, రామాపురం, సంబేపల్లి, చిన్నమండెం, రాయచోటి పోలీస్ స్టేషన్లో కూడా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అనుచరులే కేసులు పెట్టారని తెలుస్తోంది.

మదనపల్లి కు తరలింపు
రాయచోటిలో అరెస్ట్ చేసిన మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డిని పోలీసులు మొదట లక్కిరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్కు తీసుకు వెళ్లారని తెలిసింది. అదే సమయంలో రాంప్రసాద్ రెడ్డి సోదరుడు లక్ష్మీప్రసాద్ రెడ్డి తన అరవిచర్లతో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోవడం వల్ల కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. దీంతో మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డిని నియోజకవర్గంలోని మిగతా పోలీస్ స్టేషన్ లకు రాత్రంతా తిప్పినట్లు వైసిపి నేతలు ఆరోపించారు.

ఆదివారం రాత్రి చివరగా మదనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలుసుకొన్న వైసీపీ మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి, పార్టీ నాయకులు కార్యకర్తలు భారీగా మదనపల్లి కు చేరుకున్నారు..
పట్టణంలో ఆంక్షలు
రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డిని మదనపల్లికి తీసుకువచ్చిన పోలీసులు వైసీపీ నాయకులన స్టేషన్ లోకి అనుమతించలేదు. స్టేషన్ తో పాటు పరిసరాల్లో కూడా ఆంక్షలు విధించారు.
ఈ విషయం తెలిసిన మదనపల్లి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బి నరేష్ కుమార్ రెడ్డి తో పాటు పట్టణంలోని వైసీపీ నాయకులు భారీగా పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఇక్కడ బందోబస్తును డిఎస్పి మహేంద్ర స్వయంగా పర్యవేక్షించారు.
మదనపల్లి పట్టణంలో పోలీస్ స్టేషన్ వద్ద మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయ్ తిప్పారెడ్డి మీడియాతో మాట్లాడుతూ,
"రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోంది. ఇది సమర్థనీయం కాదు." అని డాక్టర్ తిపారెడ్డి వ్యాఖ్యానించారు.
"రాజకీయాల్లో విమర్శ నేటి సర్వసాధారణంగా జరిగేవి. చిన్న మాటకు కూడా కేసులు నమోదు చేయడం ద్వారా ప్రతిపక్షాన్ని లేకుండా చేయాలని చేసే ప్రయత్నం ఏమాత్రం కుదరదు". అని డాక్టర్ తిప్పారెడ్డి స్పష్టం చేశారు.. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు అనే విషయాన్ని ప్రస్తావించిన కేసులు నమోదు చేయడం ద్వారా ఎమర్జెన్సీని గుర్తు చేస్తున్నారు అని కూడా డాక్టర్ తిప్పారెడ్డి ఎద్దేవా చేశారు. ఈ తరహా వేధింపులకు స్వస్తి చెప్పాలని ఆయన ఆయన పలికారు.
అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన

రదైన లక్కిరెడ్డిపల్లె మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి అరెస్టును నిరసిస్తూ, మదనపల్లెలో అంబేడ్కర్ విగ్రహం వద్ద వైసీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన ఉంచిన టీడీపీ కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోందని నిరసన వ్యక్తం చేశారు.

Similar News