EGG RATE | గుడ్డు ధర గుబిల్లు.. కూతపెడుతున్న కోడి కూర!

బహిరంగ మార్కెట్‌లో కోడిగుడ్ల ధరలు పేలిపోతున్నాయి. ఇదే సమయంలో చికెన్‌ ధరలు తగ్గుతూ వస్తున్నాయి.

Update: 2024-12-07 04:18 GMT
మార్గసిర మాసం మొదలైన తరుణంలో చికెన్ ధరలు అందుబాటులోకి రానున్నా కోడిగుడ్ల ధరలు మాత్రం ఇప్పటికే భారీగా పెరిగాయి. బహిరంగ మార్కెట్‌లో కోడిగుడ్ల ధరలు పేలిపోతున్నాయి. ఇదే సమయంలో చికెన్‌ ధరలు తగ్గుతూ వస్తున్నాయి. ఒక కోడిగుడ్డు రిటెయిల్‌ ధర రూ.7గా పలుకుతోంది. హోల్‌సేల్‌ ధర ఒక్కో గుడ్డు రూ.6.50 పలుకుతోంది. చలికాలంలో కోడిగుడ్ల ధరలు పెరగడం సాధారణమేనని, కానీ, ఈస్థాయిలో ధర పెరగడం అరుదని జనం పెదవి విరుస్తున్నారు.
కార్తికమాసం వెళ్లిపోయింది. మార్గశిర మాసంలో వివాహ ముహూర్తాలు ఉన్నాయి. క్రిస్మస్ పండగ, కొత్త ఏడాది సందర్భంగా భారీగా కార్యక్రమాలు ఉంటాయి. ఈ వేడుకల్లో ప్రధానంగా కేక్‌లు కట్‌చేసి మిఠాయిలు పంచుకుంటారు. ఇప్పటికే జిల్లాలో ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు ప్రారంభమయ్యాయి. కేక్‌ల వినియోగం, విక్రయాలూ పెరిగాయి. కేక్‌ల తయారీలో కోడిగుడ్ల వినియోగం అధికంగా ఉంటుంది. దీంతో సహజంగానే వాటికి డిమాండ్‌ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చికెన్, మటన్ బిర్యానిలకు భారీ డిమాండ్ ఏర్పడనుంది.

ఇక కేకుల తయారీ ఉంటుంది. వాటి తయారీలో కోడిగుడ్లను వినియోగిస్తారు. దీంతో కోడిగుడ్ల ధరలు భారీగా పెరగనున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇదే పరిస్థితి నెలకొంది. న్యూ ఇయర్‌ వేడుకల కోసం కొందరు ఇప్పటినుంచే ప్లాన్‌ చేసుకుంటున్నారు. వివిధ డిజైన్లలో కేక్‌లు తయారు చేసుకునేందుకు ఆర్డర్లు ఇస్తున్నారు. దీంతో బేకరీలు, మిఠాయి దుకాణదారులు కోడిగుడ్లు కొనుగోలు చేయడం అధికమైంది. ఫలితంగా మార్కెట్‌లో కోడిగుడ్లకు ధర పెరుగుతోందని వ్యాపారులు అంటున్నారు.
సాధారణంగా కార్తికమాసం ప్రారంభం కాగానే.. చికెన్ ధరలు తగ్గిపోతాయి. హిందువుల్లో చాలా మంది పూజలు, ఉపవాసాలు ఉండడం వల్ల.. మాంసాహారం వైపు వెళ్లారు. దీంతో నాన్ వేజ్ డిమాండ్ బాగా తగ్గిపోతుంది. దీంతో వాటి ధరలు అమాంతం పడిపోతాయనుకున్నా అంతగా తగ్గలేదు. డిసెంబర్ 1తో కార్తిక మాసం వెళ్లిపోయింది. డిసెంబర్ 2వ తేదీ పోలి స్వర్గానికి వెళ్లిన రోజు. దీంతో డిసెంబర్ 3వ తేదీ నుంచి చికెన్ ధరలు ఓ మోస్తరుగా పెరిగినా జనానికి అందుబాటులో ఉన్నాయి.
ఇక కోడిగుడ్ల ధర అయితే ఇప్పటికే భారీగా పెరిగింది.
కార్తీక మాసానికి ముందు కేజీ చికెన్‌ ధర రూ.230వరకు పలికింది. ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉండడంతో డిమాండ్‌ పడిపోయిందని, ఫలితంగా చికెన్‌ ధరలు దిగొచ్చాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం కేజీ చికెన్‌ ధర రూ.180 నుంచి రూ.250 మధ్య పలుకుతోది. క్రిస్మస్‌, న్యూఇయర్‌, సంక్రాంతి వరకు చికెన్‌ ధరలు మళ్లీ పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంటున్నారు.
కోడి గుడ్ల ధరలు ఎందుకు పెరుగుతున్నాయ్?
30 గుడ్లుండే ట్రే ధర రూ.195గా ఉంది. హోల్‌సేల్‌గా గుడ్డు ధర రూ.6.50గా ఉంది. చలికాలంలో గుడ్ల ధరలు పెరుగుతుంటాయి. క్రిస్మస్‌, న్యూ ఇయర్‌ సందర్భంగా వీటి వినియోగం అధికమైంది.
ఈశాన్య రాష్ట్రాలతో పాటు స్థానికంగా గుడ్డు వినియోగం పెరిగింది. ప్రస్తుతం గుడ్డు ధర రూ.6.20 కాగా బహిరంగ మార్కెట్‌లో వినియోగదారుడికి రూ.7కు విక్రయిస్తున్నారు. ఈ ధర గతంలో ఎప్పుడూ నమోదు కాలేదని పౌల్ట్రీ రైతులు చెబుతున్నారు.
గత వేసవిలో ఎండలు పెరగడంతో 20 శాతం వరకు ఉత్పత్తి పడిపోగా రోజుకు సగటున లక్ష కోళ్లు చనిపోయాయి. పౌల్ట్రీ పరిశ్రమకు సుమారు రూ.50 కోట్ల మేర నష్టం వాటిల్లింది.
కోళ్ల మేతగా వినియోగించే మొక్కజొన్న టన్ను రూ.22 వేల నుంచి రూ.24 వేలు, నూకలు రూ.18 వేల నుంచి రూ.22 వేల చొప్పున పెరిగాయి మొత్తం మేతల ధర టన్ను రూ.26 వేల వరకు గణనీయంగా పెరగడం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. పెరిగిన నిర్వహణ వ్యయంతో ప్రస్తుతం గుడ్డు ఉత్పత్తి వ్యయం రూ.5 అవుతోందని కోళ్ల రైతులు చెబుతున్నారు.
‘కరోనా తరువాత పౌల్ట్రీ రైతులు ఇప్పటికీ కోలుకోలేదు. ప్రస్తుతం ఉన్న కోడి గుడ్డు ధర ఆశాజనకంగా ఉన్నా.. రైతుకు వచ్చేది తక్కువే. ఈ ధర ఇలాగే అయిదు నెలల వరకు ఉంటే రైతులకు కొంత మేర ఉపశమనం కలుగుతుంది.’ అని పౌల్ట్రీ రైతు సత్యనారాయణ తెలిపారు.
నాలుగైదు నెలల్లోనే కోడి గుడ్ల ధరలు భారీగా పెరిగాయి. ఆగస్టులో 5.50 రూపాయలుగా ఉన్న కోడి గుడ్డు సెప్టెంబర్ లో 6.25 రూపాయలు, అక్టోబర్ లో 6.45 రూపాయలు, నవంబర్ లో 6.50 రూపాయలు, డిసెంబర్ మొదటి వారంలో 7 నుంచి 7.50 రూపాయల వరకు చేరింది.
చికెన్ బోన్ లెస్ కిలో 220 రూపాయల నుంచి గరిష్టంగా 250 రూపాయల వరకు ఉంది. ఆయా మార్కెట్లను బట్టి ధరలను వసూలు చేస్తున్నారు.
Tags:    

Similar News