ప్రకాశం జిల్లాను వదలని భూకంపం..మళ్లీ కంపించిన భూమి

వరుస భూ ప్రకంపనలతో ప్రకాశం జిల్లా ఒక్క సారిగా ఉలిక్కిపడింది. శనివారం ఒక సారి రాగా..ఆదివారం మళ్లీ భూమి కంపించింది. దీంతో ప్రజలు పరుగులు పెట్టారు.

By :  Admin
Update: 2024-12-22 07:05 GMT

భూకంపం ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లాను వదలి పెట్టడం లేదు. దీంతో ప్రకాశం జిల్లా వాసుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. తీవ్రమైన విపత్తు ఏమైనా సంభవిస్తుందేమో అనే భయాందోళనలు నెలకొన్నాయి. వరుసగా రెండో సారి భూమి కంపించడంతో ప్రజలు హడలి పోతున్నారు. ప్రకాశం జిల్లాలో శనివారం భూ ప్రకంపనలు రాగా ఆదివారం కూడా భూమి కంపించింది. ఉదయం 11:40 గంటలకు భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తీవ్ర భయాందోళనలకు గురైన ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ప్రకాశం జిల్లాలో ముండ్లమూరు మండలంలో ఆదివారం ఉదయం 11:40 గంటల ప్రాంతంలో స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. మండల పరిధిలోని సింగన్నపాలెం, మారెళ్ల వంటి ప్రాంతాల్లో భూమి కంపించింది. భూమి కుదుపులకు గురికావడంతో ఒక్క సారిగా ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు పెట్టారు. శనివారం కూడా ఇదే ప్రాంతంలో భూమి కంపించింది. ఉదయం ఏడు గంటల సమయంలో భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ముండ్లమూరు, తాళ్లూరు, శంకరాపురం, పోలవరం, పసుపుగల్లు, ముండ్లమూరు, వేంపాడు, మారెళ్ల, తూర్పుకంభంపాడు వంటి ప్రాంతాల్లో స్వల్ప భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి. శనివారం రిక్కర్‌ స్కేలుపై 3.1గా రీడింగ్‌ నమోదు కావడంతో భూమి ఈ ప్రాంతాల్లో భూమి కంపించింది. గత మూడేళ్లుగా ఈ ప్రాంతాల్లో వరుస భూప్రకంపనలు చోటు చేసుకుంటున్నాయి. అద్దంకి, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో భూమి కంపించడం జరుగుతోంది. వరుస ప్రకంపనలు చోటు చేసుకోవడంతో ఈ ప్రాంతాల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. ఏప్పుడు ఏమి జరుగుతుందో అని హడలి పోతున్నారు.

Tags:    

Similar News