అమరావతిలో మోదీ ప్రారంభించే పనులెన్నో తెలుసా?

జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న 2019 నుంచి 2024 మధ్య ఐదేళ్ల పాటు నిలిచిపోయిన రాజధాని నిర్మాణాన్ని తిరిగి ప్రారంభించడానికి మోదీ మే 2న అమరావతి వస్తున్నారు.;

Update: 2025-04-30 10:55 GMT

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైఎస్ఆర్‌సిపి) నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2019 నుంచి 2024 మధ్య ఐదేళ్ల పాటు నిలిచిపోయిన రాజధాని నిర్మాణాన్ని అధికారికంగా తిరిగి ప్రారంభించడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 2న అమరావతి వస్తున్నారు.


గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన 92 పనులను ₹64,912 కోట్ల వ్యయంతో పూర్తి చేస్తామని మంత్రి పొంగూరు నారాయణ చెప్పారు. ఈ పనులన్నీ 2015 తర్వాత ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టినవే.

ఏళ్ల తరబడి అనిశ్చితి, న్యాయ పోరాటాలు, రాజకీయ గందరగోళం తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం అమరావతి ఎట్టకేలకు ఒక నిర్దిష్ట రూపాన్ని సంతరించుకుంది. విమర్శకులు ఒకప్పుడు "దెయ్యాల దిబ్బగా", "స్మశానవాటిక"గా కొట్టిపారేసిన ఈ రాజధాని నగరం 34,389 ఎకరాల్లో విస్తరించి ఉంది. సుమారు పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ జనంతో సందడి సందడిగా ఉంది. ఓ పెద్ద పునఃప్రారంభానికి సిద్ధమవుతోంది.
2019 మే 31 నుంచి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రభుత్వ ఉన్నతోద్యోగుల కోసం తలపెట్టిన 288 ఇళ్లతో పాటు న్యాయమూర్తులకు, మంత్రులకు ఉద్దేశించిన 73 బంగ్లాల నిర్మాణ పనులు ఆగిపోయాయి. ఇప్పుడు వాటిని తిరిగి నిర్మించే పని కొనసాగుతోంది.

పేరుకు మట్టి దిబ్బలను తొలగించడానికి భారీ యంత్రాలు రయ్ రయ్ న తిరుగుతున్నాయి. విసుగూ విరామం లేకుండా జేపీజీలు రూడ్లపై పరుగులు పెడుతున్నాయి. ప్రధాని బహిరంగ సభ కోసం ఉద్దేశించిన సువిశాల ప్రాంగణం ముస్తాబైంది. వాణిజ్య ప్లాట్ల లో మొలిచి దట్టమైన అటవీ ప్రాంతంగా మారిన చెట్లను తొలగించే పనిలో వందలాది మంది కార్మికులు పని చేస్తున్నారు.
ఈ పనుల గురించి మాట్లాడుతూ "మూడేళ్ల తరువాత, మీరో అద్భుతమైన మార్పును చూస్తారు. అమరావతి.. కలల రాజధాని నగరంగా మారుతుంది. మరెవ్వరూ మళ్లీ - ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏమిటి - అనే ప్రశ్నను లేవనెత్తలేరు" అని ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంత అభివృద్ధి అథారిటీ అదనపు కమిషనర్ నవీన్ మల్లారపు నొక్కిచెప్పారు.
వైసీపీ పాలనలో బహుళ అంతస్తుల ప్రభుత్వ భవనాలు, నివాస సముదాయాలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి. ఇప్పుడు ఆ ప్రాంతానికి కొత్త జీవం పోస్తున్నారు.
ఒకప్పుడు చీకటిలో మగ్గిపోయిన 23 కిలోమీటర్ల ఎనిమిది లేన్ల సీడ్ యాక్సెస్ రోడ్డు- ఇప్పుడు కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, LED లైట్లతో కళకళలాడుతోంది.
బౌద్ధ స్థూపం నిర్మాణంతో 16.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించాలని ప్రతిపాదించిన భారీ హైకోర్టు కాంప్లెక్స్‌లో పనులు త్వరలో పునఃప్రారంభమవుతాయి. ప్రస్తుతం ఈ ప్రాంతం ఓ తటాకాన్ని తలపిస్తోంది. ఆలాగే, ఐదు టవర్ల ఇంటిగ్రేటెడ్ సెక్రటేరియట్, అధికారిక సముదాయాల విధి కూడా అంతే.
అమరావతి రాజధాని నగర అభివృద్ధి ప్రాజెక్టుకు ప్రపంచ బ్యాంకు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకులు సుమారు 14,500 కోట్ల రూపాయలతో ఈ పనులు ప్రారంభం అవుతున్నాయి.
“కేంద్రం మరో ₹1,400 కోట్లు విరాళంగా ఇస్తుంది. గత సంవత్సరం కేంద్ర బడ్జెట్‌లో హామీ ఇచ్చినట్లుగా రాజధాని నగర ప్రాజెక్టుకు మొత్తం ఆర్థిక సహాయం ₹15,000 కోట్లకు చేరుకుంటుంది” అని ఓ అధికారి చెప్పారు. ఈ మొత్తాన్ని రాజధాని పనులను ప్రారంభించడానికి ఉపయోగిస్తామని ఆయన అన్నారు.
ఏమేమి పనులు ఇప్పుడు చేపడుతున్నారంటే...
మొదటి దశలో ఆగిపోయిన 92 పనులను తిరిగి ప్రారంభిస్తారు. వీటిని ₹64,912 కోట్ల వ్యయంతో పూర్తి చేస్తారు.
"₹42,360 కోట్ల విలువైన 68 పనులకు ఇప్పటికే టెండర్లను ఖరారు చేశారు. గత వారం, ₹4,500 కోట్లకు పైగా ఖర్చుతో ఐదు రాష్ట్ర సచివాలయ టవర్ల నిర్మాణానికి టెండర్లు పిలిచారు.
రాజధాని నగరంలో ఈ పనిని చేపట్టడానికి 3,000 మంది కార్మికులు, 500 యంత్రాలు ఇప్పటికే పని చేస్తున్నాయి. రాబోయే రెండు మూడు వారాల్లో దాదాపు 15,000 మంది కార్మికులు రానున్నారని మంత్రి పి.నారాయణ చెప్పారు.

360 కిలోమీటర్ల పొడవైన ట్రంక్ రోడ్ నెట్‌వర్క్‌ను ఏడాదిన్నరలోపు పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. "అదేవిధంగా, రాజధాని కోసం తమ భూములను ఇచ్చిన రైతులకు కేటాయించిన తిరిగి ఇవ్వదగిన ప్లాట్లలో అన్ని మౌలిక సదుపాయాలు, తాగునీటి సరఫరా, పారిశుధ్యం, తుఫాను నీటి ఉపశమనం, ప్రయోజనకరమైన అనువర్తనాల కోసం రీసైకిల్ చేసిన నీరు, రోడ్లు, విద్యుత్ మొదలైన వాటిని రెండేళ్లలోపు పూర్తి చేస్తాం" అని ఆయన అన్నారు.
గత పాలనలో పనులను వదులుకోవలసి వచ్చిన కాంట్రాక్టర్లు ఇప్పుడు పూర్తి స్థాయిలో పనులు ప్రారంభించారు. "2019లో 70% పనులు పూర్తి చేసిన తర్వాత, మేము పనులను మధ్యలో వదిలివేయాల్సి వచ్చింది. ఇప్పుడు రాజధాని నగరాన్ని పునరుద్ధరిస్తున్నాం. మేము తిరిగి పనిలోకి దిగాం. అడ్డంకులు ఉన్నప్పటికీ, గడువు లోగా పనులు పూర్తి చేసేందుకు కట్టుబడి ఉన్నామని" అని మంత్రి చెప్పారు.
అంతర్జాతీయ విమానాశ్రయానికి ఇప్పుడు శంకుస్థాపన చేయడం లేదని, ఆ తర్వాత ఈ కార్యక్రమం జరుగుతుందని మంత్రి పి.నారాయణ స్పష్టం చేశారు.
నిర్మాణ పనులు ఎంతమేర కొనసాగుతున్నాయి?
2014 నుండి 2019 వరకు రూ.41,000 కోట్ల విలువైన టెండర్లు ఖరారు చేసిన తరువాత, రూ.9,000 కోట్ల పనులు పూర్తయ్యాయి. కాంట్రాక్టర్లు, రైతులకు వార్షిక చెల్లింపులు, పెన్షన్లుగా సుమారు రూ.5,000 కోట్లు చెల్లించారు. ఇప్పుడు L1 టెండర్లు ఖరారు చేసే దశలో ఉన్నాయి. ఇప్పటివరకు 30 శాతం మానవ వనరులు, యంత్ర సామగ్రి మొబిలైజేషన్ పూర్తైంది. మే 15 నాటికి 100 శాతం మొబిలైజేషన్ సిద్ధంగా ఉంచాలని నిర్ణయించారు. మే 2న ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన తరువాత పూర్తి స్థాయిలో పనులు ప్రారంభం కానున్నాయి.
గుజరాత్ పర్యటనలో తెలుసుకున్నదేమిటంటే..
అహ్మదాబాద్‌లోని 38 కిలోమీటర్ల రివర్‌ఫ్రంట్ మాదిరిగా, కృష్ణా నదిని అభివృద్ధి చేయడంతో పాటు, ఉద్యానవనాలు, క్రీడా ప్రాంగణాలు, ఈవెంట్ స్పేస్‌లను అభివృద్ధి చేయాలనేది ప్రణాళిక. గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ నమూనాను పరిశీలించి, అమరావతిలో NTR విగ్రహాన్ని ఏర్పాటు చేయాలన్న ప్రణాళిక ఉంది.
రాజధాని విస్తరణ, పారిశ్రామిక అభివృద్ధిపై పురోగతి ఏమైనా ఉందా?
అభివృద్ధిపై నమ్మకంతో రైతులు భూమిని ప్రభుత్వానికి ఇచ్చారు. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో భూమి విలువలు పెరిగాయి. పెట్టుబడిదారుల్లో నమ్మకం కలిగింది. కానీ దీర్ఘకాలిక అభివృద్ధికి, ప్రజలు అక్కడే జీవించాలి, పని చేయాలి. ఇందుకోసం సీఎం 2,500 ఎకరాల్లో కాలుష్యం లేని పరిశ్రమలు, మరో 5,000 ఎకరాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం కోసం ప్రతిపాదించారు. విమానాశ్రయం లేకుండా గ్లోబల్ పెట్టుబడిదారులు ముందుకు రారు. ఇది శంషాబాద్ ఎయిర్‌పోర్టు అభివృద్ధితో హైదరాబాద్ అభివృద్ధి చెందిన నమూనానే.
అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ ప్రతిపాదనపై వివరాలు?
2,500 ఎకరాల్లో అంతర్జాతీయ క్రీడా నగరాన్ని సీఎం ప్రతిపాదించారు. ఇది గ్లోబల్ ఈవెంట్లకు వేదికవుతుంది. క్రీడాకారులను ఆకర్షిస్తుంది. దీనివల్ల పర్యాటక, హాస్పిటాలిటీ, సేవా రంగాల్లో ఉద్యోగాలు వస్తాయి. అంతర్జాతీయ విమానాశ్రయానికి అదనంగా 34,000 ఎకరాలు పూల్ చేసిన భూమికి బయటగా మరో భూమి అవసరమవుతుంది. కొన్ని ఎమ్మెల్యేలు భూమి స్వాధీనానికి వ్యతిరేకంగా వ్యవహరించి, pooling చేయాలని సూచించారు. రైతుల అభిప్రాయాలను గ్రహించేందుకు గ్రామ సభలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశించింది.
Tags:    

Similar News