అసెంబ్లీలో వీటిపైన చర్చించండి

నాడు నేడులో భాగంగా మధ్యలో ఆగిపోయిన పాఠశాల నిర్మాణాలను పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలి.;

By :  Admin
Update: 2025-03-03 13:57 GMT

విద్యా రంగంలో అనేక సమస్యలు ఉన్నాయని, వీటి మీద ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో చర్చించి విద్యా రంగాన్ని గాడిలో పెట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జీ ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని కోరారు. ప్రధానంగా ఈ క్రింది అంశాలపై చర్చించి, విద్యా రంగాన్ని బలోపేతం చేయాలని విజ్ఞప్తి చేశారు. జీవో నెంబర్‌ 117 ను రద్దు రద్దు చేయాలి. మూతబడ్డ 4,500 ప్రాథమిక పాఠశాలలను తిరిగి ప్రారంభించాలి. తల్లికి వందనం పథకం ఎలాంటి షరతులు లేకుండా ప్రతి విద్యార్థికి అమలు చేయాలి.

జీవో నెంబర్‌ 77ను రద్దు చేసి పీజీ విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను అందించాలి. కామన్‌ పీజీ సెట్‌ను రద్దు చేయాలి. జీవో నెంబర్‌ 107, 108 రద్దు చేసి అర్హులైన, సామాజిక, అణగారిన వర్గాల విద్యార్థులందరికీ వైద్య విద్యను అభ్యసించడానికి అందుబాటులోకి తీసుకురావాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. నిరుద్యోగులకు ప్రతి నెల రూ. 3000 నిరుద్యోగ భృతి ఇవ్వాలి. గతంలో మూతపడ్డ 4500 పాఠశాలలను పునఃప్రారంభం చేసిన అనంతరం మెగా డీఎస్సీ నిర్వహించాలి. ప్రతి మండల కేంద్రంలో ఒక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఖాళీగా ఉన్న లెక్చలర్‌ పోస్టులను భర్తీ చేయాలి. డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్‌ ప్రవేశాలను రద్దు చేయాలి. విభజన హామీల్లో ఉన్న 11 కేంద్ర విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించి, నిర్మాణం మధ్యలో ఆగిపోయిన పనులు వెంటనే పూర్తి చేయాలని కోరారు.
అంతేకాకుండా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉన్న కృష్ణా యూనివర్సిటీకి వసతి గృహాన్ని ఏర్పాటు చేయాలి. యూజీసీ తీసుకువచ్చిన ముసాయిదాను రద్దు చేయాలని శాసన సభలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలి. డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ గురుకుల పాఠశాలలకు కేటాయించిన నిధులు గతంలో దారి తప్పాయి. ఈ సారి అలా కాకుండా పాఠశాల అభివృద్ధికి ఆ నిధులను వినియోగించాలి. శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ వసతి గృహాలకు నిధులు కేటాయించి, మరమ్మతులు చేపట్డాలి. అంతేకాకుండా హాస్టల్స్‌ కోసం నూతన భవనాలను నిర్మించాలి. అలానే ఖాళీగా ఉన్న కుక్, కామాటి, వాచ్‌మెన్, వార్డెన్‌ వంటి పోస్టులను వెంటనే భర్తీ చేయాలి.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలి. ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేసి ప్రతి పాఠశాల, కళాశాల ముందు నోటీస్‌ బోర్డులో పొందుపరచాలి. విద్యా హక్కు చట్టం 2005 పకబ్బందీగా అమలు చేయాలి. అలా అమలు చేయని యాజమాన్యాలపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలి. యూజీసీ న్యాక్‌ గుర్తిపు పోందిన ప్రైవేటు యూనివర్శిటీలను ప్రక్షాళన చేయాలి. ఎన్‌ఎంసీ పొందుపరిచిన నిబంధనల ప్రకారంగా ప్రైవేటు మెడికల్‌ కళాశాలలో వసతులు ఉన్నాయా? బోధనా సిబ్బంది ఉన్నారా? లేదా? గుర్తించి, అమలు చేయని వాటి గుర్తింపు రద్దు చేయాలి. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా మధ్యలో ఆగిపోయిన పాఠశాలల నిర్మాణ పనులను పూర్తి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Tags:    

Similar News