ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డి పక్షాన కోర్టులో ఏమని వాదించారంటే
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను సిట్ అధికారులు శుక్రవారం రాత్రి అరెస్టు చేశారు.;
ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిలను శుక్రవారం రాత్రి అరెస్టు చేసిన సిట్ అధికారులు వైద్య పరీక్షల అనంతరం శనివారం విజయవాడ ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, ఓఎస్‌డీ కృష్ణమోహన్‌రెడ్డిల మీద సిట్ అధికారులు రూపొందించిన రిమాండ్ రిపోర్టు మీద విజయవాడ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల పక్షాన మాజీ న్యాయవాది, మాజీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్‌లు వాదనలు వినిపించారు.
పదవీ విరమణ పొందిన అధికారులు కే ధనుంజయరెడ్డి, పీ కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్టులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, ఇది పూర్తిగా రాజకీయ ప్రేరేపితమైన కేసు అని మాజీ అడ్వకేట్ జనరల్ సీనియర్ న్యాయవాది శ్రీరామ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. పదవీ విరమణ పొందిన అధికారులు ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్టు సక్రమం కాదని, రాజకీయ దురుద్దేశంతోనే వీరిని అరెస్టు చేశారని పేర్కొన్నారు. ఈ ఇద్దరి మాజీ అధికారుల అరెస్టులకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవని, కోర్టుకు కూడా వీరి అరెస్టుకు సంబంధించిన ఆధారాలు ఏమీ ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. లిక్కర్ స్కామ్ కేసులో సిట్ ఏర్పాటు అనేది కూడా చట్ట విరుద్దని అన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సిట్‌కు లిక్కర్ కేసును విచారించే అర్హత లేదన్నారు. రూ. 3200 కోట్లు లిక్కర్ స్కామ్ జరిగిందనడానికి ఆధారాలు ఎక్కడ ఉన్నాయని, సిట్ అధికారులు చెబుతున్నట్లు ఆ రూ. 3200 కోట్ల లిక్కర్ స్కామ్‌కు సంబంధించిన ఆధారాలు కోర్టుకు కూడా ఇవ్వలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
అంతేకాMýంండా ప్రభుత్వ సొంత కార్పొరేషన్ రికార్డుల్లో ఉన్న సమాచారాన్ని కూడా ఇవ్వలేదన్నారు. గత ప్రభుత్వ పాలనలోని ఐదేళ్లేల్లో మద్యం ఆదాయం పెరిగిందని, దీంతో పాటుగా మద్యం వినియోగం తగ్గడంతో పాటుగా ఆదాయం పెరిగిందని, ఈ నేపథ్యంలో సిట్ అధికారులు చెబుతున్నట్లుగా రూ. 3200 కోట్ల మద్యం కుంభకోణం ఎక్కడ జరిగింది అంటూ కోర్టులో వాదనలు వినిపించారు. దీంతో పాటుగా ఆంధ్రప్రదేశ్ ఆదాయం గత ఐదేళ్లల్లో రూ. 16వేల కోట్ల నుంచి రూ. 24వేల కోట్లకు ఆదాయం పెరిగిందని, మరి ప్రభుత్వానికి ఎక్కడ నష్టం వాటిల్లింది అంటూ కోర్టులో శ్రీరామ్ నిందితుల తరపున వాదనలు వినిపించారు. ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్‌రెడ్డిల అరెస్టులకు సంబంధించిన కారణాలను కూడా కాపీ పేస్ట్ చేశారని, ఈ కేసు మీద ఇది వరకే సుప్రీం కోర్టు స్పందించిందని, ఇది రాజకీయ ప్రేరేపితం కూడా అయ్యిఉండొచ్చు అని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.