ఏపీలో కొనసాగిన తిరంగ్‌ ర్యాలీలు

భారత ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్‌ సింధూర్‌ విజయవంతం కావడంతో ఏపీలో తిరంగ్‌ ర్యాలీ నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.;

Update: 2025-05-17 15:59 GMT

ఆంధ్రప్రదేశ్‌లో తిరంగ్‌ ర్యాలీలు కొనసాగుతున్నాయి. శుక్రవారం సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌లు శుక్రవారం విజయవాడలో జరిగిన తిరంగ్‌ ర్యాలీలను ప్రారంభించారు. శనివారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కూటమి వర్గాలు తిరంగ్‌ ర్యాలీలు నిర్వహించారు. గుంటూరులో కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో తిరంగ్‌ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు మేయర్‌ కోవెలమూడి రవీంద్ర, ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, ఎమ్మెల్యేలు నసీర్‌ అహ్మద్, రామాంజనేయులు, ఏపీఐడీసీ చైర్మన్‌ డేగల ప్రభాకర్‌లు పాల్గొన్నారు. స్థానిక ప్రజలు కూడా దీనిలో భాగస్వాములయ్యారు. అనంతపురంలో తిరంగ్‌ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని ఆర్ట్స్‌ కళాశాల నుంచి క్లాక్‌ టవర్‌ సప్తగిరి సర్కిల్‌ వరకు జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రులు పయ్యావుల కేశవ్, సత్యకుమార్‌ యాదవ్, ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, కలెక్టర్‌ వినోద్‌ కుమార్, ఎస్పీ జగదీష్‌లు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

బాపట్ల జిల్లా వేమూరులో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు. మంత్రి పార్థసారధి, జిల్లా కలెక్టర్‌ మురళీలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇదే సందర్భంలో స్వచ్చాంధ్ర–స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. వేమూరు రోడ్ల మీద మానవహారం నిర్వహించారు. ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు, మంత్రి పార్థసారథి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ప్రజలతో మంత్రి పార్థసారథి ప్రతిజ్ఞ చేయించారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులో తిరంగ్‌ ర్యాలీ నిర్వహించారు. ఆపరేషన్‌ సింధూర్‌కు, భారత సైనిక దళాలకు అభినందనలు తెలుపుతూ 1500 మీటర్ల జాతీయ జెండాతో కొవ్వూరు పట్టంలో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
పశ్చమ గోదావరి జిల్లా భీమవరంలో కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో తిరంగ్‌ ర్యాలీ నిర్వహించారు. పీఏసీ చ్మైన్‌ పులపర్తి రామాంజనేయులు, ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు, టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యులు తోటా సీతారామలక్ష్మి, ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి, కూమటి నాయకులు పాల్గొన్నారు.
Tags:    

Similar News