దేవి నవరాత్రులు: మహిషాసుర మర్దినిదేవిగా కొలువైన అమ్మవారు

శుక్రవారం మహిషాసుర మర్దినిదేవిగా అమ్మవారు కొలువయ్యారు. ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మహిషాసుర మర్దిని దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.

Update: 2024-10-11 03:35 GMT

విజయవాడ ఇంద్రకీలాద్రి దేవి నవరాత్రులు చివరి దశకు చేరుకున్నాయి. శుక్రవారం మహిషాసురమర్దిని దేవి రూపంలో కొలువైన అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ రూపానికి ఓ ప్రత్యేకత ఉంది. మహిషాసురుడనే రాక్షసుడిని చంపిన ఉగ్రరూపంగా ఈ రూపాన్ని చెబుతారు. సకల దేవి, దేవతల శక్తులన్నీ ఈ దేవిలో మూర్తిభవించి ఉంటాయని భక్తులు విశ్వసిస్తారు. మానవ నేత్రంతో చూడడానికి సాధ్యం కాని దివ్య తేజస్సుతో, అనేక ఆయుధాలతో సింహవాహినిౖయె దుర్గమ్మ భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తుంది. ఈ రోజు అమ్మవారిని దర్శనం చేసుకుంటే అసాధ్యమనేది ఉండదనేది భక్తుల నమ్మకం.

మహిషాసుర సంహారం జరిగిన రోజునే మహర్నవమిగా ఈ రోజును జరుపుకోవడం భక్తులు చేస్తారు. ఈ రోజున చండీ సప్తశతీ హోమం చేస్తారు. ఈ హోమాన్ని చేస్తే శత్రుభయం ఉండదని నమ్ముతారు. అన్ని విధాలుగా విజయం కలుగుతుందని భావిస్తారు. పూజలు చేసి, ఓం ఐం హ్రీం శ్రీం సర్వసమ్మోహిన్యై స్వాహా అనే మంత్రాన్ని జపిస్తారు. పానకం, వడపప్పు, గారెలు, పులిహోరా, పాయసన్నంతో నివేదన ∙చేస్తారు. సువాసినీ పూజ చేసి, మంగళద్రవ్యాలు, శక్తి కొద్దీ కొత్త వస్త్రాలను అమ్మవారికి సమర్పిస్తారు. శుక్రవారం మహిషాసురమర్దిని దేవిగా దర్శనమిచ్చే అమ్మవారు శనివారం పండుగ రోజు శ్రీరాజరాజేశ్వరిదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు.

దేవి నవరాత్రుల మహోత్సవాలు చివరి దశకు చేరుకున్నాయి. దుర్గగుడికి భవానీ భక్తుల రాక మొదలైంది. దసరా ఉత్సవాల చివరి మూడు రోజుల్లో కొంత మంది భవానీలు అమ్మవారిని దర్శించుకుంటారు. దసరా మరుసటి రోజు నుంచి రెండు రోజుల పాటు వేల సంఖ్యలో భవానీలు అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఈ భవానీ భక్తుల కోసం దుర్గమ్మను శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలోనే రెండు రోజుల పాటు ఉంచుతారు. ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కొండ దిగువన కనకదుర్గనగర్‌లో భవానీలు మాల విరమణ చేస్తారు. బుధవారంతో పోల్చితే గురువారం భక్తుల సంఖ్య కాస్త తగ్గారు. మూల నక్షత్రం కావడంతో బుధవారం రెండు లక్షలకుపైగా భక్తులు తరలి వచ్చారు. గురువారం లక్ష మంది వరకు అమ్మవారి దర్శనం చేసుకున్నారు.
Tags:    

Similar News