దేవి నవరాత్రులు: శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ దర్శనం

దేవి నవరాత్రులు నేటితో ముగియనున్నాయి. శనివారం ఆఖరి రోజు. శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ అమ్మవారు ఈ రోజు కొలువయ్యారు.

Update: 2024-10-12 03:40 GMT

దేవి నవరాత్రులు నేటితో ముగియనున్నాయి. శనివారం ఆఖరి రోజు. శ్రీ రాజరాజేశ్వరీదేవిగా దుర్గమ్మ అమ్మవారు ఈ రోజు కొలువయ్యారు. ఎనిమిది రోజుల పాటు ఒక్కో రోజు ఒక్కో రూపంలో దర్శనమిచ్చిన దుర్గమ్మ అమ్మవారు చివరి రోజైన శనివారం రాజరాజేశ్వరీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. పండుగ పర్వదినమైన విజయదశమి రోజున రాజరాజేశ్వరీదేవి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే జీవితం ధన్యమవుతుందని భక్తులు విశ్వసిస్తారు. విజయదశమి రోజు అన్నీ ఉచిత దర్శనాలే అని ఆలయ నిర్వాహకులు ప్రకటించారు. ఈ రోజు వీఐపీ, వీవీఐపీ వంటి టిక్కెట్ల దర్శనాలు లేవని, అన్ని క్యూలైన్లు ఉచిత దర్శనాలే అని ప్రకటించారు. తెల్లవారు జామున 4 గంటల నుంచే అమ్మవారు దర్శనమిస్తున్నారు. రాత్రి 11 గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు.

శక్తి స్వరూపిణీ మహాత్రిపురసుందరీ, శ్రీ చక్ర అధిష్టాన దేవత ఈ రాజరాజేశ్వరీదేవి. దేవి నవరాత్రుల్లో తొమ్మిది రోజులు ముగిసిన తర్వాత విజయదశమి జరుపుకుంటారు. ఈ విజయదశమి అపరాజితాదేవి పేరు మీద ఏర్పడిందని భక్తుల నమ్మకం. ఆదిపరాశక్తి స్వరూపిణి అయిన దుర్గమ్మ వివిధ రూపాలను ధరించి రాక్షసులను సంహరించి లోకానికి సంతోషాన్ని ప్రసాదించిందని భక్తులు విశ్వసిస్తారు. ఆమెకు ఎక్కడ అపజయమే లేదు. కాబట్టే దుర్గమ్మ అపరాజితా అయ్యిందని నమ్మకం. ఎప్పుడు విజయాన్ని సాధించింది కాబట్టి దుర్గమ్మను విజయా అని కూడా పిలుస్తారు.
అలాంటి ఆదిపరాశక్తి అయిన దుర్గమ్మ శాంత స్వరూపంతో చిరునవ్వులు చిందిస్తూ ఇక్షుఖండాన్ని చేతిలో ధరించి, ఒక చేత అభయ ముద్రని చూపిస్తూ దసరా నవరాత్రుల ఉత్సవాల్లో దర్శనమిచ్చిందని భక్తులు నమ్మకం. అలాంటి అపరాజితాదేవి స్వరూపమైన రాజరాజేశ్వరీదేవి రూపంలో ఉన్న దర్గుమ్మను దర్శనం చేసుకుంటే అపజయమే ఉండదని భావిస్తారు. పున్నమిఘాట్‌లో శుక్రవారం నిర్వహించిన నారీ శక్తి కార్యక్రమంలో సీఎం చంద్రబాబు సతీమణి, నారా భువనేశ్వరి, మంత్రులు గంగలపూడి అనిత, కందుల దుర్గేష్, ఎస్‌ సవిత పాల్గొన్నారు.
దేవి నవరాత్రుల ఉత్సవాల్లో తెప్పోత్సవం కీలకమైన ఘట్టం. విజయదశమి రోజున తెప్పోత్సవం నిర్వహిస్తారు. దుర్గమ్మ దేవాలయానికి పక్కనే ఉన్న కృష్ణా నదిలో దీనిని నిర్వహిస్తారు. అయితే కృష్ణా నదిలో వరద నీటి ప్రవాహం ఎక్కువుగా ఉన్నందువల్ల హంస వాహనంపై నదీ విహారం సురక్షితం కాదని, దీంతో తెప్పోత్సవాన్ని అధికారులు రద్దు చేశారు. శుక్రవారం ట్రయల్‌ రన్‌ కూడా రద్దు చేశారు. ఎగువ నుంచి దాదాపు 40వేల క్యూసెక్కుల వరద నీటి ప్రవాహం ఉండటంతో దీనిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అందువల్ల దుర్గాఘాట్‌ వద్ద హంస వాహనాన్ని నిలకడగా ఉంచి పూజలు చేస్తారు. శనివారం సాయంత్రం కొండపై ఉన్న మల్లేశ్వరస్వామి ఆలయం నుంచి కనకదుర్గానగర్‌ మీదుగా ఉత్సవ మూర్తులను ఊరేగింపుగా కృష్ణా నది వద్దకు తీసుకొస్తారు.
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవి నవరాత్రుతులు గత గురువారం అంగరంగ వైభంగా ప్రారంభమయ్యాయి. శనివారంతో ముగియనున్నాయి. తొమ్మిదో రోజు హిషాసురమర్దిని దేవి రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారిని దర్శనం చేసుకుంటే సకల శుభాలు చేకూరుతాయని, ధైర్యం, స్థైర్యం, విజయం సిద్ధిస్తాయని భక్తులు నమ్ముతారు.
Tags:    

Similar News