దేవి నవరాత్రులు: దుర్గాదేవిగా అమ్మవారి దర్శనం

ఇంద్రకీలాద్రిపై దేవి నవరాత్రులు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు దుర్గాష్టమి. దుర్గావతారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు.

Update: 2024-10-10 03:12 GMT

దేవీ నవరాత్రుల్లో ఎనిమిదో రోజుకు ప్రత్యేకత ఉంది. గురువారం అమ్మవారి అలంకరణకు విశిష్టత ఉంది. ఈ రోజు దుర్గాష్టమి. పవిత్ర దినం. ఈ రోజు అమ్మవారు దుర్గాదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దుర్గతులను నివారించే ఆదిపరాశక్తి దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తున్నారు. ఈ దుర్గదేవి అవతారంలో దుర్గముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. పంచ ప్రకృతి మహా రూపాల్లో తొలి రూపం దుర్గాదేవి రూపం. భవబంధాల్లో చిక్కుకున్న మానవుడిని అనుగ్రహించి మోక్షాన్ని ప్రసాదించే మాతగా దుర్గాదేవిని కొలుస్తారు. కోటి సూర్య ప్రభలతో వెలుగొందే అమ్మవారిని ఈ రోజు పూజించి దర్శిస్తే శత్రుపీడనం తొలగి పోతుందని భక్తుల విశ్వసిస్తారు. జీవితాల్లో సర్వత్రా విజయం పాప్తిస్తుందని నమ్ముతారు. ఈ రోజు దుర్గాదేవి రూపంలో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరిస్తారు. ఎర్రని వస్త్రం సమర్పిస్తారు. ఎర్రటి అక్షింతలు, ఎర్రటి పూలతో అమ్మవారికి ఈ రోజు ప్రత్యేకంగా పూజలు చేసి ఆరాధిస్తారు.

దేవీ నవరాత్రుల్లో ఈ రోజు దుర్గాష్టమి పర్వదినం. ఈ రోజు అమ్మవారు దుర్గతులను రూపు మాపే దర్గావతారంలో భక్తులకు దర్శనిమిస్తారు. ఎర్రని వస్త్రం సమర్పిస్తారు. నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా అమ్మవారికి సమర్పిస్తారు. దుర్ఘముడనే రాక్షసుడిని అమ్మవారు సంహరించారు. అందువల్ల ఈ రోజు దుర్గాష్టమిగా భక్తులు జరుపుకుంటారు. ఈ దుర్గాష్టమి రోజు ఆయుధ పూజ చేస్తారు.

మూల నక్షత్రం సందర్భంగా బుధవారం భక్తులతో ఇంద్రకీలాద్రి కిటకిటలాడింది. లక్షలాది మంది భక్తులు తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. క్యూలైన్లు, రహదారులు, ఘాట్‌ రోడ్డు ఇలా అన్నీ భక్తులతో కిక్కిరిసి పోయాయి. అర్థ రాత్రి వరకు క్యూలైన్లు రద్దీగానే ఉన్నాయి. బుధవారం ఒక్క రోజు రెండు లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌ తన కుమార్తెతో కలిసి అమ్మవారిని దర్శనం చేసుకున్నారు.

Tags:    

Similar News