వేంకటేశ్వర ప్వామికి పుష్పాలంటే ఎందుకంత ప్రేమ....
శ్రీవారి పుష్పాలంకరణ వెనుక కథ ఇదీ..
శ్రీవారు తన వక్షస్థలంపై స్ధానం కల్పించిన శ్రీదేవి, భూదేవికి ఒకటిన్నర మూర పొడవు ఉన్న పూలమాలలతో అలంకరించడం ఆనవాయితీ.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. వజ్రవైఢూర్యస్వర్ణాలంకారల తర్వాత ఆయనకు పూల అలంకరణ ఇష్టం. శ్రీవారికి నిర్వహించే అనేక సేవల్లో పుష్ప కైంకర్యం అత్యంత ప్రియమైంది. ఆభరణాలు బంగారువైనా పూలవైన ఆహ్లాదకరమయిన వాతావరణం కల్పిస్తాయి. రోజూ 15టన్నుల పూల దేశవిదేశాలనుంచి దేవుడి కోసం దిగుమతి చేసుకుంటారని ఆలయ అధికారులు చెప్పారు. ఈ పూలని 200 మంది మహిళలు 2000 గజాాల మాలలుగా అల్లుతారు. బ్రమ్మోత్సవాల సమయంలో పూల వినియోగం పతాక స్థాయికి చేరుకుంటుంది. 2024 బ్రహ్మోత్సవాలలో 40 మెట్రిక్ టన్నుల పూల వినియోగించారు. ఈ సారి ఇది 60 మెట్రిక్ టన్నుల దాకా ఉంటుంది. పూలతో పాటు సువాసన వెదజల్లే అనేక రకాల ఆకులను కూడా పూలసేవకు వినియోగిస్తారు. దీనిని బట్టి పూలకు ఎంత ప్రాముఖ్యం ఉందో తెలుసుకోవచ్చు.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నిర్వహించే పుష్పకైంకర్యం అత్యంత పవిత్రమైనదని చిరువాయి మొళి (Tiruvaymoli) అనే ప్రాచీన తమిళ గ్రంథంలో కూడా ప్రస్తావించారు.
రోజుకు 121 కిలోల వజ్ర వైఢూర్యాలు పొదిగిన బంగారు ఆభరణాలను అలంకరిస్తూ ఉంటారు. ఆతర్వాత పూల అలంకారం వస్తుంది. గురువారం నాడు మాత్రం దేవుడికి ఇతర అభరణాలేవీ లేకుండా కేవలం పుష్ఫాలతోనే అలంకరిస్తారు. ఈ పుష్పాలంకరణ చాలా జాగ్రత్త నిర్వహిస్తారు. తమిళనాడు, బెంగుళూరు లనుంచి అలంకార నిపుణులను రప్పిస్తారు. అంతేకాదు, వీటికోసం టిటిడి (Tirumala Tirupati Devastanams) ప్రత్యేకాధికారులు ఉన్నారు. శ్రీవారి అలంకరణలో పూలకు, వాటి మాలలకు, అలంకరణకు వాడే సుగంధ ద్రవ్యాల(Scents and Perfumes) చాలా ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. (పుష్పాలు రంగురంగులతో ఉంటాయి. సువాసనలు వెదజల్లుతూ ఉంటాయి. పుష్పాలను పత్రాలను దేవతలకు సమర్పించడం హిందూ సంప్రదాయం.తిరుమల కలియుగ వైకుంఠం. ఇక్కడ ఒక ప్రత్యేక దైవిక, ఆధ్యాత్మిక వైభవం అవరించి ఉంటుంది. దానిని భక్తులకు ప్రసాదించేందుకు శ్రీనివాసుడు ఇలా పుష్పాలంకరణతో దర్శనమిస్తాడు,’ అని ప్రముఖ సంస్కృత పండితుడు వైద్యం వేంకటేశాచార్ అన్నారు.
ఆ వివరాలు ఏంటో తెలుసుకుందాం.
పుష్పాలంకరణ జాబితా
శ్రీవారి ప్రసాదాల తయారీకి దిట్టం (ముడిసరుకుల కొలతలు) ఎలా ఉంటుందో. పుష్పాలంకరణకు కూడా అదే దిట్టం అమలు చేస్తున్నారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని ఆపాదమస్తకం అలంకరించే పూలమాలలకు స్థిరమైన పేర్లు ఉన్నాయి. తిరుమల శ్రీవారి నిలువెత్తు విగ్రహాన్ని పుష్పాలు పత్తరాలతో అల్లిన పూలమాలల ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం.