కువైట్ లోనూ కల్తీ మద్యం.. మోగుతున్నచావు డప్పు

ఆరుగురు సీమవాసులు సహా 23 మంది బలి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-08-16 08:10 GMT
కువైట్ (ఫైల్)

కువైట్ లో జరిగిన కల్తీ సారా ఘటన ఆంధ్రాలో కలవరం రేకెత్తించింది. 

కువైట్ లో కల్తీ మద్యం తాగి 160 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఇప్పటి వరకు 23 మంది మరణించారు. ఆ దేశ ప్రజారోగ్య శాఖ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మరణాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు కువైట్ లోని ఎన్ఆర్ఐ వర్గాల సమాచారం.
తీవ్ర అనారోగ్యానికి గురైన వారంతా కువైట్ లోని అనేక ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. గల్ఫ్ మీడియా కూడా ఈ సంఘటనకు ప్రాధాన్యత ఇస్తూ కథనాలు ప్రచురించింది. వారిలో 60 మంది కంటిచూపు కోల్పోవడం, 50 మంది వరకు కిడ్నీ సంబంధ సమస్యలు తలెత్తి, డయాలసిస్ చేస్తున్నట్లు అక్కడ తెలుగువారి ద్వారా తెలిసింది.
ఉపాధి కోసం వెళ్లి, కువైట్ డ్రైవర్ గా పనిచేస్తున్న షేక్ మస్తాన్ కథనం మేరకు
" మాకు ఇప్పటి వరకు తెలిసిన సమాచారం మేరకు తెలుగు వాళ్లు ఇద్దరు మరణించారు. తమిళనాడుకు చెందిన ఇద్దరు, కేరళ ప్రాంతీయులు ఎనిమిది మంది మృతుల్లో ఉన్నట్లు తెలిసింది" అని మస్తాన్ చెప్పారు. అయితే మృతుల వివరాలు మాత్రం ఇక్కడ చెప్పడం లేదు. ఈ విషయంపై ఇక్కడ బహిరంగంగా మాట్లాడినా ప్రమాదమే" అని మస్తాన్ ఆందోళన వ్యక్తం చేశారు. కానీ మృతుల్లో తెలుగు వారు ఆరుగులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం అందింది.
ఎలా ఉన్నారో..
కువైట్ లో జరిగిన సంఘటన రాయలసీమ ప్రాంతంలో తీవ్ర ఆందోళన కలిగించింది. చనిపోయిన వారిలో తమ కుటుంబీకులు ఉన్నారా? అనే విషయాలు తెలుసుకునేందుకు సతమతం అవుతున్నారు.
కువైట్ లోని రాయభార కార్యాలయంలో అత్యసవర సమాచారం అందించడానికి 965 65501587 ఫోన్ నంబర్ అందుబాటులో ఉంచింది.
ఈ నంబర్ కు సంప్రదించగా,
"బంధువులకు మాత్రమే సమాచారం ఇస్తాం. అది కూడా ఆధార్ కార్డు పంపించాలి. మృతుడికి ఉన్న కుటుంబ సంబంధాలు పరిశీలించి వివరాలు ఇస్తాం" అని కువైట్ లోని భారత్ రాయభార కార్యాలయ అధికారి సమాధానం ఇచ్చారు.
చనిపోయిన వారి పేర్లు, వివరాలు వారి పాస్ పోర్టు ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఆ వివరాలు ప్రకటించకుండా, బంధువులకు సమాచారం తెలిసే అవకాశం లేదు.
కువైట్ ప్రభుత్వం కూడా చనిపోయిన వారి సంఖ్యను ప్రకటించింది. మినహా, ఏ ప్రాంతం వారనేది ప్రస్తావించలేదు.
కువైట్ ఇంగ్లీష్ మీడియాలో కూడా ఘటనకు దారితీసిన పరిస్థితి మాత్రమే ప్రస్తావించారు. మినహా, మృతుల ఫోటోలు ఏ దేశాలకు చెందిన వారనే వివరాలు గోప్యంగా ఉంచింది. ఈ పరిస్థితుల్లో..
"సీమ"లో కలవరం
కువైట్ లో జరిగిన విషాద ఘటన రాయలసీమ ప్రాంతంలో ఆందోళన రేకెత్తించింది. చనిపోయిన వారిలో తమ కుటుంబీకులు ఉన్నారా? లేదంటే క్షేమంగా ఉన్నారా అనే వివరాలు తెలుసుకునేందుకు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కువైట్ లో ఉన్న మిగతా వారు చెబితే గానీ వివరాలు బయటికి వచ్చే అవకాశం కనిపించడం లేదు.
ఉపాధి కోసం గల్ఫ్ దేశాలకు ప్రధానంగా కువైట్ కు దాదాపు 50 సంవత్సరాల నుంచి వందలాది మంది వెళ్లే వారు. ఆ కోవలో కడప జిల్లా రాజంపేట, రైల్వే కోడూరు, రాయచోటి, చిత్తూరు జిల్లా పీలేరు తోపాటు ప్రతి పల్లె, పట్టణం నుంచి కువైట్ వెళ్లిన వారి సంఖ్య దాదాపు 2.50 లక్షల మంది వరకు ఉంటుందనే విషయం ఓ సర్వేలో తేల్చారు.
తెలుగు వాళ్లు ఎక్కువగా కువైట్ లోని ఖైతాన్, ఫర్వానియా, సాల్మియా, అహ్మది ప్రాంతాలలో వలస కార్మికులు నివాసం ఉండే ప్రాంతాలు. ఇక్కడ గదులు అద్దెకు తీసుకొని వివిధ రకాల పనులు చేసుకుంటూ ఉంటారు.
ఎడారి ప్రాంతంలో సారా తయారు చేసి, ఖాళీ వాటర్ బాళ్లలో డోర్ డెలివరీ సాగిస్తుంటారనేది కువైట్ కు వెళ్లి వచ్చిన వారు చెబుతున్నారు. వాస్తవానికి కువైట్ లో మద్యం తాగడం కూడా నేరమే. కానీ,
"ఆసియా దేశాల నుంచి వచ్చిన వారు దీనికి కుటీర పరిశ్రమగా మార్చి కష్టాలు కొని తెచ్చకుంటున్నారు" అని కువైట్ లో దాదాపు 40 ఏళ్ల జీవితం అనుభవించి వచ్చిన కడప జిల్లా చిట్వేలికి చెందిన ఖదీర్ వ్యాఖ్యానించారు.
"కువైట్ లో ఏమి జరిగిందనేది ఇంకా పూర్తి సమాచారం బయటికి రాలేదు. అక్కడి ప్రభుత్వం కూడా అంతే నిక్కచ్చిగా ఉంటుంది. భారత రాయభార కార్యాలయం ద్వారా మాత్రమే వివరాలు బయటికి తెలియడానికి ఆస్కారం ఉంది" అని ఖదీర్ వివరించారు
అద్దెకు ఇచ్చిన పాపం
అనేక దేశాల నుంచి కువైట్ కు ఉపాధి కోసం వలస వెళుతుంటారు. అక్కడి అరబ్బు షేకులకు మాత్రమే సొంత ఇల్లు ఉంటుంది. గదులు నిర్మించి, వలస కార్మికులకు అద్దెకు ఇస్తుంటారు.
మద్యం తాగి 23 మంది వరకు మరణించిన ఘటన నేపథ్యంలో వలస కార్మికులకు ఇళ్లు అద్దెకు ఇచ్చిన కువైట్ ఇంటీరియర్ మినిస్టర్ (మన దేశంలో హోం మంత్రి హోదా) ను అరెస్టు చేశారు.
"కువైట్ లో చట్టాలు కఠినంగానే ఉంటాయి" అని అక్కడి ఓ మీడియా సంస్థలో పనిచేస్తున్న కడప జిల్లాకు చెందిన ఓ సీనియర్ జర్నలిస్టు చెప్పారు.
"చనిపోయిన వారి వివరాలు బయటకు తెలియడం లేదు" అని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
"ఉపాధి కోసం వెళ్లిన వారిలో కువైట్ లోని కొన్ని ప్రదేశాల్లో ఎక్కువగా తెలుగువారు నివాసం ఉన్నారు" అని అక్కడ డ్రైవర్ గా పనిచేసే మస్తాన్ చెప్పారు.
కువైట్ లో సారా తాగి 160 మంది వరకు తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రుల్లో ఉన్నారు. అంతకుమించన సంఖ్యలోనే జైళ్లలో వేశారు. చనిపోయిన వారిలో ఇద్దరు తెలుగు వారు ఉన్నారని చెబుతున్నారు. వారి వివరాలు ఇంకా తెలియలేదు" అని మస్తాన్ వివరించారు.
కువైట్ లోని భారత రాయభార కార్యాలయం వివరాలు ప్రకటిస్తే గానీ, పూర్తి వివరాలు తెలిసే అవకాశం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో కువైట్ లోని తమ యోగక్షేమాల కోసం ఇక్కడి వారి సంబంధీకులు తీవ్ర కలవరం చెందుతున్నారు.
వలస వచ్చిన వారికి ఇళ్లు అద్దెకు
కల్తీ మద్యం తాగి దాదాపు 160 మంది వరకు అస్వస్థతకు గురయ్యారు. వారిలో ఎప్పటి వరకు 23 మంది మరణించినట్లు కువైట్ ప్రజారోగ్య శాఖ కూడా అధికారికంగా ప్రకటించింది.
ఈ ఘటనకు బాధ్యత చేస్తూ కువైట్ ఇంటీరియర్ మినిస్టర్ (మన దేశంలో హోం శాఖ మంత్రికి సమానం) కూడా అరెస్టు చేశారు.
గల్ఫ్ దేశాల్లో ప్రధానంగా కువైట్ కు కడప జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వెళ్ళిన వారు పెద్ద సంఖ్యలో జీవనం సాగిస్తున్నారు.
కువైట్ నగర శివారులో అక్రమంగా నాటు సారా తయారు చేస్తున్నారని ఆరోపణలు ఎక్కువగా ఉండేవి.
కువైట్ లో అందుబాటులో ఉన్న డ్రై ఫ్రూట్స్ కు తోడు ఇథనాల్ తోక్ పాటు రసాయనాలు కలపడం ద్వారా సారా తయారి చేసినట్టు సమాచారం.
ఎడారిలో సారా తయారీ..
వాస్తవానికి కువైట్ లో మద్యం తాగడమే కాదు విక్రయాలు కూడా నిషిద్ధం.
కువైట్ నగరానికి శివారు ప్రాంతం అంతా ఎడారులే. ఈ ప్రదేశాలను సారా తయారీకి కొందరు డేన్స్ (Dens) గా మార్చుకున్నట్లు కువైట్ లోని తెలుగువారు చెబుతున్నారు.
కువైట్ లో కుటీర పరిశ్రమగా మార్చుకున్న కొందరు వ్యక్తులు దీనిని ఏకంగా వ్యాపారం ప్రారంభించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో తయారుచేసిన సారాను ఖాళీ వాటర్ బాటిల్ లో నింపి డోర్ డెలివరీ సాగిస్తున్నట్లు పప్రవాసా ఆంధ్రులు చెప్పారు.
Tags:    

Similar News