ఏపీ మద్యం కేసులో తెరపైకి వైసీపీ మరో ముఖ్యనేత పేరు

తాజా ఛార్జ్ షీట్ లో దర్శి ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి పేరును చేర్చిన సిట్ అధికారులు;

Update: 2025-09-17 08:08 GMT

ఏపీ మద్యం కేసులో సిట్ అధికారులు తవ్వే కొద్దీ కొత్తపేర్లు వెలుగులోకి వస్తున్నాయి.తాజాగా మరో వైపీపీ ముఖ్య నేత పేరు తెర మీదకు వచ్చింది. దర్శి వైసీపీ ఎమ్మెల్యే బూచేపల్లి పేరు ను సిట్ ఛార్జ్ షీట్ లో ప్రస్తావించింది. ఛార్జ్ షీట్ లో కీలక అంశాలను ప్రస్తావించింది.గత ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసేందుకు మద్యం ముడుపుల సొమ్మును ఆయనకు అందచేసినట్లు సిట్ దర్యాప్తులో తేలింది. తాజాగా దాఖలు చేసిన రెండో అనుబంధ అభియోగపత్రంలో మే 13న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగ్గా, కొద్ది రోజుల ముందు అంటే ఏప్రిల్ 21,22 తేదీల్లో చెవిరెడ్డి, బాలాజీ కుమార్ యాదవ్ ప్రకాశ్ జిల్లా పొదిలిలో ఉన్నట్లు సిట్ అభియోగ పత్రంలో పేర్కొంది. అదే సమయంలో బాలాజీ కుమార్ యాదవ్ పలుమార్లు శివప్రసాద్ రెడ్డి తో ఫోన్ కాల్స్ మాట్లాడారని వెల్లడించింది.

చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలోని పలువురు వైసీపీ అభ్యర్ధులకు ఎన్నికల ఖర్చుల నిమిత్తం మద్యం ముడుపుల సొమ్ము చేరవేతంతా చెవిరెడ్డి పర్యవేక్షణలో సాగిందని సిట్ ఇప్పటికే ఆధారాలు సేకరించింది. ఈ క్రమంలోనే శివప్రసాద్ రెడ్డికి మద్యం ముడుపుల సొమ్ము అందించినట్లు సిట్ గుర్తించింది. దీంతో, త్వరలోనే శివప్రసాద్ రెడ్డిని సిట్ విచారణ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
మద్యం కేసులో విచారణలో కొత్త వ్యక్తుల ప్రమేయం పైన సిట్ అధికారులు ఆరా తీస్తూనే వున్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు వైసీపీ నేతలు ఎంపీ మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరి కొందరిని సిట్ అరెస్టు చేసింది. వారంతా జైలులోనే ఉన్నారు.ఒకరిద్దరు కొందరు బెయిల్ పైన బయటకు వచ్చారు. ఇదే సమయంలో అనూహ్యంగా వైసీపీ దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పేరు తెరమీదకు రావడం చర్చకు దారితీసింది.
Tags:    

Similar News