'అనంత'లో సీఎం చంద్రబాబు పర్యటన
ఆర్భాటాలకు ఆస్కారం లేకుండా ఏర్పాట్లు చేశారు. సామాజిక పింఛన్లు పంపిణీతో పాటు గ్రామ ప్రజలతో సీఎం చంద్రబాబు ముఖాముఖి నిర్వహించనున్నారు.
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజవర్గం బొమ్మనహాళ్ మండలం నేమకల్లు గ్రామంలో ఈ రోజు (శనివారం) మధ్యాహ్నం సీఎం. ఎన్. చంద్రబాబు పర్యటించనున్నారు. లబ్ధిదారులకు ఎన్టీఆర్ సామాజిక భరోసా పింఛన్లు పంపిణీ చేయడంతో పాటు గ్రామసభలో పాల్గొనే సీఎం చంద్రబాబు సమస్యలు కూడా స్వయంగా తెలుసుకుంటారు. నేమకల్లు గ్రామంలో హెలిప్యాడ్ స్థలాన్ని, ప్రసిద్ధి చెందిన శ్రీ ఆంజనేయస్వామి దేవాలయాన్ని, నేమకల్లులో గ్రామసభ నిర్వహించే ప్రాంతంలో ఏర్పాట్లను రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాలువ శ్రీనివాసులు, రాష్ట్ర ఆర్థిక శాఖా మంత్రి పయ్యావుల కేశవ్ శుక్రవారం పరిశీలించిన వారు ఏర్పాట్లు చేశారు.
శనివారం ఉదయం 11 గంటలకు: తాడేపల్లిలోని నివాసం నుంచి రోడ్డు మార్గాన విజయవాడ విమానాశ్రాయానికి బయలుదేరుతారు.
11.35: విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి విమానంలో బయలుదేరి మధ్యాహ్నం
12.25 గంటలకు కర్ణాటకలోని జిందాల్ విజయనగర విమానాశ్రాయానికి చేరుకుంటారు.
12.45: హెలిక్యాప్టర్‌లో నేమకల్లు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు.
12.50 గంటల నుంచి 1.20 రిజర్వుడు
1.20 నుంచి హెలిపాడ్ నుంచి నేమకల్లు గ్రామం ఇందిరమ్మ కాలనీకి చేరకుంటారు.
01.25 నుంచి 1.55 వరకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు లబ్ధిదారులకు ఇళ్ల వద్ద పంపిణీ చేస్తారు.
0155 నుంచి 2.00 వరకు నేమకల్లులోని ఆంజనేయస్వామి వారి ఆలయంలో పూజలు
2.05 నుంచి 3.05 వరకు గ్రామస్తులతో ముఖామఖి
03.10 నేమకల్లు గ్రామం నుంచి బొమ్మనహాళ్ వరకు రోడ్డు మార్గంలో చేరుకుంటారు.
03.15 నేమకల్లు హెలిపాడ్ కు చేరుకుంటారు.
03.15 నుంచి 03.45 వరకు ప్రజాప్రతినిధులతో మాటామంతీ.
03.45 హెలికాప్టర్ లో బయలుదేరుతారు.
04.05 కు కర్ణాటకలోని తోరగల్లులోని జిందాల్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
04.50కి విజయవాడ విమానాశ్రయం
04.55 విమానాశ్రయం నుంచి బయలేదేరి
05.30 ఉండవల్లిలోని నివాసానికి చేరుకుంటారు.