పులివెందులలో రిగ్గింగ్ చేశారన్నందుకు అంబటిపై పోలీసు కేసు
మార్ఫింగ్‌డియోలను పోస్టు చేశారని, అంబటి రాంబాబు పై ఫిర్యాదు చేశారు.;
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓట్లు రిగ్గింగ్ చేశారని విష ప్రచారం చేస్తున్నారని, మాజీ మంత్రి, వైసీపీ కీలక నాయకుడు అంబటి రాంబాబుపై టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసిన అంబటి రాంబాబుపై చర్యలు తీసుకోవాలని గుంటూరు జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు గుంటూరు ఎస్పీకి సోమవారం సాయంత్రం ఫిర్యాదు చేశారు. 2023లో పశ్చిమ బెంగాల్‌లో జరిగిన ఎన్నికల వీడియోలను అంబటి రాంబాబు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారని వడ్రాణం హరిబాబు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో జరిగిన ఎన్నిల వీడియోలను ఆంధ్రప్రదేశ్‌లో జరిగినట్టుగా మార్ఫింగ్‌లు చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని హరిబాబు పేర్కొన్నారు. అనంతరం హరిబాబు మాట్లాడుతూ.. ఫేక్ వీడియోలు పెడుతూ టీడీపీపై బురద జల్లారని.. ఇలా ఫేక్ వీడియోలను పోస్టు చేయడం వైసీపీ వాళ్లకు పరిపాటిగా మారిపోయిందని, ఇలా చేస్తే కూటమి ప్రభుత్వం చూస్తూ ఊరుకునేది లేదని, ఈ సారి అంబటి రాంబాబు జైలుకు వెళ్లడం ఖాయమని పేర్కొన్నారు.