'సీబీఎన్ పాత్ వేస్ టు సక్సెస్' పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై రాసిన పుస్తకాన్ని సచివాలయంలో సోమవారం చంద్రబాబు ఆవిష్కరించారు.;

Update: 2025-05-19 16:21 GMT
సీబీఎన్ పాత్ వేస్ టు సక్సెస్ పుస్తకాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం చంద్రబాబు

'సీబీఎన్ పాత్ వేస్ టు సక్సెస్' అనే పుస్తకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. చంద్రబాబు 75 ఏళ్ల జీవిత ప్రస్థానాన్ని వివరిస్తూ ఐఐటీ మద్రాస్ పూర్వ విద్యార్థి డి రాజేష్ కుమార్, రీచ్‌ ఎయిట్స్ ఈటీ అండ్ సీ ప్రైవేట్ లిమిటెడ్‌ ఎండీ డీఏ రాజు సంయుక్తంగా ఈ పుస్తకాన్ని రచించారు.

దీనిని సచివాలయంలో సోమవారం సీఎం ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో సీఎం చంద్రబాబు జీవితాంశాలు, విజన్, విజయ సూత్రాలు, అభివృద్ధి విధానాలు వంటి వివిధ అంశాలను గురించి పొందుపరిచారు. సీఎంను కలిసిన వారిలో వీఎన్ఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ బన్ బాబు ఉన్నారు. 
Tags:    

Similar News