టీడీఆర్ అక్రమాలకు డెడ్‌లైన్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి నారాయణ
ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.. టీడీఆర్ బాండ్ల అక్రమాలకు మరోసారి మాట్లాడారు. ఈ అక్రమాలను అతి త్వరలోనే తేలుస్తామని, ప్రస్తుతానికి ఇందుకు సెప్టెంబర్ ఆఖరును డెడ్‌లైన్‌గా పెట్టుకున్నామని వెల్లడించారు.
ఏపీ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ.. టీడీఆర్ బాండ్ల అక్రమాలకు మరోసారి మాట్లాడారు. ఈ అక్రమాలను అతి త్వరలోనే తేలుస్తామని, ప్రస్తుతానికి ఇందుకు సెప్టెంబర్ ఆఖరును డెడ్‌లైన్‌గా పెట్టుకున్నామని వెల్లడించారు. వైసీపీ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా టీడీపీఆర్ బాండ్ల అక్రమాలకు విచ్చలవిడిగా జరిగాయని, తమ జేబులు నింపుకోవడానికి వైసీపీ నేతలు ఈ అక్రమాలను పెంచి పోషించారని విమర్శించారు. ఈరోజు మంత్రి నారాయణ.. తిరుమతి వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దర్శనం అనంతరం ఆయన మాట్లాడుతూ.. టీడీఆర్ బాండ్ల అక్రమాలకు కీలక వ్యాఖ్యలు చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి కూడా ప్రభుత్వం చేస్తున్న ప్లాన్స్‌ను వివరించారు. అనంతరం తిరుపతిలోని అధికారులతో ఆయన సమావేశమయ్యారు.
రూ.వేల కోట్లు పక్కదారి..
‘‘టీడీఆర్ బాండ్ల అక్రమాలు రూ.వేల కోట్లలో జరిగాయి. దొరికినంతా దోచుకో అన్నదే తమ మోటోగా వైసీపీ నేతలు పనిచేశారు. ఏమాత్రం వెనకడుగు వేయకుండా కేవలం టీడీఆర్ బాండ్ల రూపాన రూ.వేల కోట్లు పక్కదారి పట్టించారన్నారు. ఇప్పటికే ఈ అక్రమాలపై ప్రత్యేక కమిటీ వేశాం. కమిటీ నివేదిక వచ్చిన వెంటనే తదుపరి చర్యలు తీసుకుంటాం. వైకాపా పాలనలో అవినీతి కొత్తపుంతలు తొక్కింది. నగరపాలక సంస్థల్లో ఉద్యోగులను నియమించి వ్యక్తిగత అవసరాలకు వినియోగించారు. మున్సిపల్ శాఖలో ప్రధానంగా ఆరు సమస్యలు ఉన్నట్లు గుర్తించాం. వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం’’ అని చెప్పారు.
ఉద్యోగాలు కావాలంటే పరిశ్రమలు రావాలి..
‘‘ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి మెరుగుపడాలంటే పరిశ్రమలు రావాలి. ప్రస్తుతం సీఎం చంద్రబాబు అదే పనిలో ఉన్నారు. యువతకు ఉద్యోగ అవకాశఆలు పెరగాలన్నా పరిశ్రమలు రావాల్సిందే. రెండు నెలల్లోనే 100 అన్న క్యాంటీన్లు ప్రారంభమయ్యాయి. సెప్బెంబర్ 13న మరో 75 అన్న క్యాంటీన్లు ప్రారంభిస్తాం. అదే విధంగా యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడంపై కూడా స్పెషల్ ఫోకస్ పెడతాం’’ అని చెప్పారు. అనంతరం ఆయన తుడా కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. అమరావతి నిర్మాణం విషయంలో కూడా సీఎం చంద్రబాబు చర్చించనున్నట్లు చెప్పారు.