ఈనెల 22న ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఈనెల 24న జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొంటారు. ముందు రోజు కేంద్ర మంత్రులను కలుస్తారు.;

Update: 2025-05-20 10:04 GMT

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 22వ తేదీ ఢిల్లీ వెళుతున్నారు. 23వ తేదీ పలువురు కేంద్ర మంత్రులను సిఎం కలవనున్నారు. అదే విధంగా రాష్ట్రానికి పెట్టుబడులకు సంబంధించి పలువురు పారిశ్రామిక వేత్తలతో కూడా సిఎం భేటీ అవ్వనున్నారు. 24వ తేదీ ఉదయం 9.30 గంటలకు భారత్ మండపంలో జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో సిఎం పాల్గొంటారు. రాష్ట్రాన్ని ఆర్థికంగా ఆదుకునే విషయం ఈ మీటింగ్ లో ప్రస్తావించే అవకాశం ఉంది. పెట్టుబడులు ఆహ్వానించేందుకు ఢిల్లీ టూర్ ను ఉపయోగించుకోవాలనే ఆలోచనలో సీఎం ఉన్నారు. అదే రోజు రాత్రి తిరుగు ప్రయాణమై అమరావతి చేరుకుంటారు.



Tags:    

Similar News