Breaking|నారావారిపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు ఆదివారం నారావారిపల్లెకు చేరుకున్నారు. తమ్మడు రామ్మూర్తి భౌతికకాయానికి నివాళులర్పించారు.

Update: 2024-11-17 06:41 GMT

అనారోగ్యంతో తుదిశ్వాస విడిచిన తమ్ముడు నారా రామ్మూర్తి అంత్యక్రయలకు హాజరు కావడానికి సీఎం చంద్రబాబు నారావారిపల్లెకు చేరుకున్నారు. కొద్దిసేపటి కిందట ఆయన హైదరాబాద్ నుంచి విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్నారు.


నారావారిపల్లెకు చేరుకున్న సీఎం చంద్రబాబు తన తమ్ముడు రామ్మూర్తి భౌతికకాయానికి నివాళులర్పించారు. ఆయన తో పాటు నారా లోకేష్ తన భార్య బ్రహ్మణితో కలిసి నివాళులు అర్పించారు. వారి వెంట నందమూరి కుటుంబీకులు కూడా వచ్చారు. ఎన్టీఆర్ కుమారుడు నందమూరి రామకృష్ణ కూడా నారావారిపల్లెకు వచ్చారు. అంతకుముందు రేణిగుంట విమానాశ్రయంలో అధికారులు సీఎం  చంద్రబాబును స్వాగతించారు.



రేణిగుంట విమానాశ్రయంలో సీఎం చంద్రబాబుకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. వెంకటేశ్వర్, డిఐజీ షిమోషి బాజ్ పాయ్, ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్, మున్సిపల్ కమిషనర్ శ్రీమతి ఎన్. మౌర్య, టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్. నాయుడు, శ్రీకాళహస్తి, నగరి, చిత్తూరు, జీడి. నెల్లూరు ఎమ్మెల్యేలు బొజ్జల సుధీర్ రెడ్డి, భాను ప్రకాష్, గురజాల జగన్ మోహన్, డా. థామస్ స్వాగతం పలికారు. అనంతరం సీఎం చంద్రబాబు రోడ్డుమార్గంలో నారావారి పల్లెకు చేరుకున్నారు.


విమానాశ్రయంలో అధికారులతో పాటు, టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు కూడా సీఎం చంద్రబాబును స్వాగతించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబుకు వారు ప్రగాఢ సానుభూతి తెలిపారు. వారందరి నుంచి వీడ్కోలు తీసుకున్న సీఎం చంద్రబాబు నారావారిపల్లెకు  బయలుదేరి వెళ్లారు.


మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ రేణిగుంట విమానాశ్రయంలో సీఎం చంద్రబాబును కలిశారు. చంద్రబాబు తమ్ముడి మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం రోడ్డు మార్గాన నారావారిపల్లెకి బయలుదేరి వెళ్ళారు.


Tags:    

Similar News