శ్రీవారి సన్నిధిలో సీజేఐ

తిరుమల శ్రీవారిని సీజేఐ దర్శంచుకున్నారు. ఆయనకు టీటీడీ దర్శనం ఏర్పాట్లు చేసింది.

Update: 2024-09-29 09:36 GMT

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై.చంద్రచూడ్ ఆదివారం ఉద‌యం దర్శించుకున్నారు. కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన జస్టిస్ డివై.చంద్రచూడ్ కు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వద్ద టీటీడీ ఈఓ జే. శ్యామలరావు, అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి స్వాగతం పలికారు.వారిని క్యూకాంప్లక్స్ నుంచి శ్రీవారి దర్శనానికి ఆలయంలోకి తీసుకుని వెళ్లారు.


 మహద్వారం నుంచి ఆలయంలోకి చేరుకోగానే ధ్వజస్తంభానికి మొక్కుకున్నారు. తమ మనసులోని కోరికలతో భక్తిశ్రద్ధలతో బలిపీఠానికి తలఆనించి ప్రార్ధించారు. ఆ తరువాత సీజేఐ చంద్రచూడ్ కుటుంబ సభ్యలను శ్రీవారి దర్శనానికి టీటీడీ అధికారులు తోడ్కొని వెళ్లారు.



స్వామివారి దర్శనానంతరం జస్టిస్ డివై.చంద్రచూడ్, ఆయన కుటుంబీకులకు రంగనాయకుల మండపంలో వేద‌ పండితులు వేదాశీర్వచనం అందించారు. టీటీడీ ఈఓ శ్యామలరావు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి తీర్థప్రసాదాలు అందజేశారు.


తిరుపతికి శనివారం చేరుకున్నారు. మొదట తిరుచానూరు పద్మావతి అమ్మవారిని జస్టిస్ డివై.చంద్రచూడ్ దర్శంచుకున్నారు. అనంతరం రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతించారు. జస్టిస్ డివై.చంద్రచూడ్ కుటుంబానికి పద్మావతి అతిథిగృహాల ప్రాంగణంలో వసతి కల్పించారు. ఆదివారరం కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. వారి వెంట న్యాయశాఖ అధికారులు కూడా ఉన్నారు.


Tags:    

Similar News