కేంద్ర మంత్రి మాండవీయతో చంద్రబాబు భేటీ
సీఎం చంద్రబాబు రెండో రోజు ఢిల్లీ టూర్ కొనసాగుతోంది.;
ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎ చంద్రబాబు కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసే పనిలో బిజీ బిజీగా ఉన్నారు. అందులో భాగంగా కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయతో బుధవారం భేటీ అయ్యారు. బుధవారం మధ్యాహ్నం 2:30 గంటలకు జల్ శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌ను, ఇదే రోజు సాయంత్రం 4:40 గంటలకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కలవనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న కార్యక్రమాలకు, ప్రాజెక్టులకు నిధులు విడుదల చేయాలని కోరనున్నారు. బుధవారం రాత్రి 7 గంటల సమయంలో సీఐఐ స్వర్ణాంధ్రప్రదేశ్ టాస్క్ ఫోర్స్ నివేదికను సీఎం చంద్రబాబు విడుదల చేయనున్నారు. మరో వైపు సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన మీద ఆంధ్రప్రదేశ్‌లో ఆసక్తి నెలకొంది. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన నిధుల మంజూరు విషయంలోను, ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వడం వంటి అంశాల్లోను కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారు, సీఎం చంద్రబాబు ఎలా రియాక్ట్ అవుతారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.