రెండు రోజులు చంద్రబాబు బిజీబిజీ
రెండు రోజుల టూర్‌లో సీఎం చంద్రబాబు పలువురు ఢిల్లీ పెద్దలతో సమావేశం కానున్నారు.;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. తన రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో పలువురు ఢిల్లీ పెద్దలను కలవనున్నారు. గురువారం రాత్రి ఢిల్లీ వెళ్లిన సీఎం చంద్రబాబు శుక్రవారం రోజు పలువురు కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ కానున్నారు. ఆంధ్రప్రదేశ్ డెవలప్‌మెంట్ కోసం సహకరించాలని కేంద్ర మంత్రులను కోరనున్నారు. ఏపీలోని పలు ప్రాజెక్టులతో పాటు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పలు పథకాలపై చర్చలు జరపనున్నారు. అందులో భాగంగా హోం మంత్రి అమిత్‌షా నిర్వహించే నూతన క్రిమినల్ చట్టాలు, వాటి అమలు తీరు వంటి పలు అంశాలకు సంబం«ధించిన రివ్యూ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరు కానున్నారు.
శుక్రవారం ఉదయం 10గంటలకు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు సమావేశం కానున్నారు. తర్వాత ఉదయం 11 గంటలకు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తోను సమావేశం కానున్నారు. అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు మరో కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌తో సీఎం చంద్రబాబు సమావేశం కానున్నారు. తర్వాత మధ్యాహ్నం 1 గంటలకు కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్‌తో సమావేశం కానున్నారు. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాల మీద చర్చించనున్నారు. శుక్రవారం సాయంత్రం 3 గంటల సమయంలో ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు సమావేశం కానున్నారు.
ఆ తర్వాత సాయంత్రం నాలుగు గంటలకు కొత్త క్రిమినల్ చట్టాలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్వహించే సమీక్ష సమావేశానికి హాజరు కానున్నారు. ఆ సమీక్ష సమావేశం అయిపోయిన తర్వాత రాత్రి 9 గంటలకు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ మంత్రి అశ్వనీవైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. తర్వాత రెండో రోజు శనివారం భారత్ మండపంలో జరగనున్న నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి సీఎ చంద్రబాబు హాజరు కానున్నారు.