ఏపీలో అకస్మాత్తుగా పిడుగులు పడే అవకాశం

ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా తీవ్ర ఎండలు, వడగాల్పులు, పిడుగు పాటు వర్షాలు తీవ్ర భయాందళనలకు గురి చేస్తున్నాయి.;

Update: 2025-04-21 05:25 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఓ వైపు అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు ఠారెత్తిస్తుండగా మరో వైపు వడగాల్పులు, పిడుగులతో కూడిన వర్షాలు భయాందోళనలకు గురి చేస్తున్నాయి. వీటి ప్రభావంతో అకస్మాత్తుగా పిడుగులు పడే అకాశాలు ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో అకస్మాత్తుగా పిడుగులు పడిన దుర్ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లెలో ఆదివారం ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. కొంత మంది యువకులు క్రికెట్‌ ఆడుతున్న సమయంలో అకస్మాత్తుగా పిడుగు పడింది. దీంతో 17 ఏళ్ల సన్నీ, 18 ఏళ్ల ఆకాశ్‌ అనే యువకులు మరణించారు. మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే త్రీవంగా గాయపడిని ఆ యువకుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. అకస్మాత్తుగా పిడుగు పడి ఇద్దరు యువకులు దుర్మణం పాలుకావడంతో పెద్దోబినేనిపల్లలో తీవ్ర విషాదం అలుముకుంది. యువకుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగి పోయారు.

సోమవారం ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తగా 31 మండలాల్లో తీవ్ర వడగాల్పుల ప్రభావం ఉంటుంది. శ్రీకాకుళం జిల్లాల్లోని 4 మండలాలు, విజయనగరం జిల్లాలోని 16 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 11 మండలాల్లో ఈ ప్రభావం ఉండనుంది. అలాగే మరో 20 మండలాల్లో వడగాలుల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రోణంకి కూర్మనాథ్‌ తెలిపారు.
మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 10 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, మరో 15 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 1, విజయనగరం జిల్లాలో 8, పార్వతీపురం మన్యం జిల్లాలో 4, అల్లూరి సీతారామరాజు జిల్లాలో1, విశాఖపట్నం జిల్లాలో 1, అనకాపల్లి జిల్లాలో 5 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందన్నారు.
మరో వైపు ఆంధ్రప్రదేశ్‌లో భానుడు ఉగ్ర రూపం దాల్చుతున్నాడు. దీంతో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఆదివారం నంద్యాల జిల్లా ఔకులో 42.6డిగ్రీలు, తిరుపతి జిల్లా వెంకటగిరి,చిత్తూరు జిల్లా నగరి, ప్రకాశం జిల్లా పునుగోడులో 42.5డిగ్రీలు, నెల్లూరు జిల్లా మనుబోలులో 42.4డిగ్రీలు, పల్నాడు జిల్లా వినుకొండ, వైఎస్సార్‌ కడప జిల్లా ఉప్పలూరులో 42.2డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదైందన్నారు.
ఎండతీవ్రంగా ఉండి బయటకు వెళ్లేప్పుడు తలకు టోపి, కర్చీఫ్‌ కట్టుకోవాలి, గొడుగు ఉపయోగించాలి. చెవుల్లోకి వేడిగాలి వెళ్ళకుండా జాగ్రత్త పడాలి. గుండె సంబంధిత వ్యాదులు, షుగర్, బీపీ ఉన్నవారు ఎండలో తిరగకూడదని, శారీరక శ్రమతో కూడిన కఠినమైన పనులను ఎండలో చేయరాదని సూచించారు.
అంతేకాకుండా ఆకస్మాతుగా పిడుగులతో పడే వర్షాలు పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములతో కూడిన వర్షాలు పడే సమయాల్లో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెట్ల కింద, కరెంటు స్థంభాల కింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
Tags:    

Similar News