కర్నూలు దగ్గిర బస్సు దగ్దం, అనేక మంది సజీవ దహనం?
బస్సుని స్కూటర్ ని ఢీకొనడంతో ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం జరిగింది. బస్సులో మంటలు లేచి బస్సు పూర్తిగా కాలిపోయింది. సుమారు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు (నంబర్ DD09 N9490) అర్ధరాత్రి అనంతరం కర్నూలు పట్టణానికి 20 కిమీ దూరాన ఉన్న చిన్నటేకూరు సమీపంలో బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు బైకు ఢీకొనగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు బస్సు మొత్తం వ్యాపించాచయి. పలువురు ప్రయాణికులు చిక్కుకుపోయి సజీవదహనమయ్యారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం. సుమారు 20 మంది దాకా సజీవ దహనమైనట్లు సమాచారం . పూర్తి వివరాలు అందాల్సి ఉంది.
బస్సు- బైకు ఢీ: ప్రమాదం తెల్లవారుజామున సుమారు 4గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తున్నది. హైదరాబాద్ నుంచి రాత్రి 10.30 గంటలకు బయలుదేరింది. జాతీయ రహదారి మీద బెంగళూరుకు వెళ్తుండగా చిన్నటేకూరు వద్ద ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టినట్లు సమాచారం. ఢీకొట్టిన వెంటనే బస్సుకు నిప్పంటుకుంది. ముందు భాగంలో మంటలు చెలరేగాయి. కొద్దిసేపట్లోనే మంటలు ఇంజిన్ లోకి ప్రవేశించి మొత్తం బస్సునంతా వ్యాపించాయి. ఇంధన ట్యాంక్ పేలడంతో మంటలు ఉవ్వెత్తున లేచాయి. బస్సులో 40 మంది దాకా ప్రయాణిస్తున్నట్లు తెలిసింది. ఇందులో కొంతమంది బస్సు అత్యవసర ద్వారం పగలగొట్టి బయటకు దూకారు. వీరిపేర్లు: సత్యనారాయణ, శ్రీలక్ష్మి, నవీన్‌కుమార్, అఖిల్, హారిక, జష్మిత, అకీర, రమేష్, జయసూర్య, సుబ్రహ్మణ్యం, రామిరెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి. వీ స్వల్ప గాయాలతో బయటపడ్డవారిని కర్నూలు జనరల్ ఆస్పత్రికి తరలించారు. మంటలల్లో బస్సు పూర్తిగా దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది సమయానికి చేరుకున్నప్పటికీ అప్పటికే బస్సు దగ్ధమైపోయింది.
ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి: కర్నూలు సమీపాన చోటుచేసుకున్న ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దుబాయ్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రికి అధికారులుప్రమాదసమాచారం చేరవేశారు. వెంటనే ఉన్నతాధికారులతో మాట్లాడి క్షతగాత్రులకు తక్షణ చికిత్స అందించాలని, మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సహకరించాలని ఆదేశించారు.
I am shocked to learn about the devastating bus fire accident near Chinna Tekur village in Kurnool district. My heartfelt condolences go out to the families of those who have lost their loved ones. Government authorities will extend all possible support to the injured and…
— N Chandrababu Naidu (@ncbn) October 24, 2025