కివీస్‌ను కట్టడి చేసిన బౌలర్లు..భారత్ టార్గెట్ 252
తొలుత భారీగానే పరుగులు సమర్పించుకున్న టీమ్ ఇండియా బౌలర్లు క్రమంగా బంతి మీద పట్టు సంపాదించారు. వికెట్లను పడగొడుతూ కివీస్ జట్టును ఒత్తిడిలోకి నెట్టారు.;
దుబాయ్‌లో జరుగుతున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తుది పోరులో భారత బౌలర్లు చెలరేగి పోయారు. భారత జట్టు కివీస్ జట్టును కట్టడి చేసింది. న్యూజీలాండ్ జట్టు భారీ సంఖ్యలో పరుగులు సాధించకుండా భారత బౌలర్లు కట్టడి చేశారు. దీంతో న్యూజీలాండ్ జట్టు ఏడు వికెట్లను కోల్పోయి నిర్ణీత 50 ఓవర్లలో 251 పరుగులు మాత్రమే సాధించ గలిగింది. టీమ్ ఇండియా బౌలర్లు కుల్దీప్ యాదవ్ 2, వరుణ్ చక్రవర్తి 2 వికెట్లు సాధించగా, మహ్మద్ షమీ, రవీంద్ర జడేజాలు ఒక్కో వికెట్ చొప్పున సాధించి కివీస్ జట్టు పరుగుల ప్రవాహానికి అడ్డుకట్ట వేశారు. కివీస్ ఇన్నింగ్స్‌లో డారిల్ మిచెల్ 63 పరుగులు, మైకేల్ బ్రేస్వెల్ 53(నాటౌట్), రచిన్ రవీంద్ర 37, గ్లెన్ ఫిలప్స్ 34, విల్ యంగ్ 15, కేన్ విలియమ్స్‌న్ 11, టామ్ లాథమ్ 14 పరుగులు సాధించగా న్యూజిలాండ్ కెప్టెన్ మైకేల్ శాంట్నర్ పరుగులు సాధించడంలో విఫలమయ్యాడు. 8 పరుగులు మాత్రమే సాధించాడు.