(Breaking ):బీజేపీ గ్రీన్ సిగ్నల్..టీటీడీ బోర్డు నియామకానికి జీఓ జారీ

తిరుపతి బీజేపీ నేత టీటీడీ బోర్డులో సభ్యుడయ్యారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం 25 మంది సభ్యులతో జీవో విడుదల చేసింది.

Update: 2024-11-01 16:23 GMT

టీటీడీ పాలకమండలి నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం పేర్లను ప్రకటించింది. టీవీ5 చైర్మన్ బీఆర్. నాయుడు సారధ్యంలో 24 మంది పేర్లను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ జాబితాలో ఒక సభ్యుడి పోస్ట్ ను ఖాళీగా ఉంచింది. తిరుపతికి చెందిన బీజేపీ రాష్ట్ర ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పేరు చేర్చడానికి  అనుమతి లభించడంతో, టీటీడీ పాలకమండలి నియామకానికి లైన్ క్లియర్ అయింది. ఆమేరకు శుక్రవారం జీవో జారీ అయింది.




బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డిని 25వ సభ్యుడిగా జాబితాలో చేర్చారు. దీంతో మూడు రోజులుగా నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.
టీడీపీ కూటమి ఏర్పడిన నాలుగు నెలల తర్వాత చైర్మన్గా టీవీ5 బీఆర్. నాయుడు సారధ్యంలో 24 మంది సభ్యులతో టీటీడీ పాలకమండలి జాబితాను సీఎం ఎన్. చంద్రబాబు ప్రకటించారు. ఇది జరిగి ఇప్పటికీ రెండు రోజులైంది. కానీ జీఓ మాత్రం విడుదల కాలేదు. అందుకు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ బీజేపీ నాయకులు ఈ కమిటిలో లేకపోవడమే అని తెలుస్తోంది. దీనిపై తీవ్రస్థాయిలో ఒత్తిళ్లు రాజకీయ వ్యవహారాలు చోటుచేసుకున్నాయి. తిరుపతికి చెందిన బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి పేరును జాబితాలో చేర్చి ఎట్టకేలకు రాష్ట్ర దేవాదాయ శాఖ జీవో ఎంఎస్ నెంబర్ 243 నంబరుతో నవంబర్ ఒకటో తేదీ ఉత్తర్వులు జారీ చేసింది.
సీఎం ఎన్. చంద్రబాబు నాయుడు సారధ్యంలోని టీడీపీ ప్రభుత్వ కూటమిలో బీజేపీ కూడా భాగస్వామిగా ఉంది. రెండు రోజుల క్రితం టీటీడీ పాలకమండలిని సీఎం చంద్రబాబు 24 మంది సభ్యులతో జాబితా ప్రకటించారు. అందులో ఒక పోస్టు ఖాళీగా ఉంచారు. దీని వెనుక బీజేపీ అనుమతి కోసం నిరీక్షించారనే విషయం ఈరోజు విడుదలైన జీఓ ద్వారా స్నష్టమేంది.
Tags:    

Similar News