క్యాన్సర్ ఆసుపత్రికి అమరావతిలో బాలకృష్ణ భూమిపూజ
బసవతారకం ఆసుపత్రికి తుళ్లూరు వద్ద 21 ఎకరాలను గతంలో సీఎం చంద్రబాబు స్థలాన్ని కేటాయించారు.;
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బసవతారకం ఇంకోఅమెరికన్ క్యాన్సర్ సుపత్రి, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ నిర్మాణానికి ఆ సంస్థ ఛైర్మన్, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ భూమిపూజ నిర్వహించారు. హైదరాబాద్‌లోని బసవతారం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిని అమరావతిలో ఏర్పాటు చేయాలని ఇది వరకే నిర్ణయించారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆ మేరకు రాజధాని అమరావతిలో భూమిని కూడా కేటాయించారు. తుళ్లూరు వద్ద 21 ఎకరాలను కేటాయించారు. దాదాపు రూ. 750 కోట్ల పెట్టుబడితో 500 పడకల సామర్థ్యంతో ఆసుపత్రి నిర్మాణం చేపట్టనున్నారు. తర్వాత దీనిని వెయ్యి పడకల స్థాయికి పెంచనున్నారు. దీనిలో అన్ని అధునాతన పరికరాలను అందుబాటులోకి తీసుకొని రావడంతో పాటుగా అన్ని రకాల మౌలిక సదుపాయాలను కూడా కల్పించానున్నారు. వ్యాధి నిర్థారణతో పాటు అన్ని రకాల వైద్య సేవలు అందించాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రత్యేక విభాగాలను ఏర్పాటు చేయడంతో పాటు రీసెర్చ్ నిర్వహించేందుకు అవసరమైన విభాగాల ఏర్పాటు కూడా అందుబాటులోకి తేనున్నారు. 2028 నాటికి ఈ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిని ప్రారంభించాలనే ఆలోనచలు చేస్తున్నారు.