జెత్వానీ కేసులో కుక్కల విద్యాసాగర్‌కు బెయిల్
వైఎస్‌ఆర్ సీపీ నాయకుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త కులక్కల విద్యా సాగర్ గత కొద్ది రోజులుగా జైల్లో ఉన్నారు.;
సినీ నటి కాదంబరి జెత్వానీ కేసులో అరోపణలు ఎదుర్కొంటూ జైల్లో ఉన్న వైఎస్‌ఆర్‌సీపీ నాయకుడు, ప్రముఖ పారిశ్రామిక వేత్త కుక్కల విద్యాసాగర్‌కు ఏపీ హైకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. జెత్వానీ ఫిర్యాదు ఆధారంగా కుక్కల విద్యాసాగర్‌పైన పోలీసులు నమోదు చేశారు. గత 76 రోజులుగా ఆయన జైల్లో ఉన్నారు. ఈ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కుక్కల విద్యాసాగర్ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై గత వారం కోర్టు విచారణ చేపట్టింది. జెత్వానీ, పోలీసుల తరపున న్యాయవాది నర్రా శ్రీనివాస్, పీపీ లక్ష్మినారాయణ కోర్టులో వాదనలు వినిపించారు. బెయిల్ మంజూరు చేస్తే నిందితుడు కేసును ప్రభావితం చేస్తాడని న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు.
ఇదే సమయంలో నిందితుడు కుక్కల విద్యాసాగర్ తపున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి తన వాదనలు వినిపించారు. నిందితుడు ఇప్పటికే 76 రోజుల పాటు జైల్లో ఉన్నారని, బెయిలు మంజూరు చేయాలని కోర్టుకు తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు ఈ సోమవారానికి తీర్పును వాయిదా వేసింది. మరో సారి సోమవారం ఇదే అంశంపై విచారణ జరిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కుక్కల విద్యాసాగర్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సినీ నటి కాదంబరి జెత్వానీ కేసును తెరపైకి తెచ్చింది. దీంతో కుక్కల విద్యాసాగర్ జాడా కనిపించకుండా పోయింది. అజ్ఞాతంలోకి వెళ్లారు. జెత్వానీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు డెహ్రాడూన్‌లో ఉన్న కుక్కల విద్యాసాగర్‌ను విజయవాడ పోలీసులు అరెస్టు చేసి ఇక్కడకు తీసుకొచ్చారు. అక్కడ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచిన అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై ఆయనను విజయవాడకు తీసుకొచ్చారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన సీనియర్ ఐపీఎస్ అధికారులు పీ సీతారామాంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీలతో పాటు సీఐ సత్యనారాయణ, ఏసీపీ హనుమంతురావులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది.