భర్తతో సంసారం చేయి..బావతో సంబంధం పెట్టుకో

అనైతిక కోరికను బాధితురాలు తిరస్కరించడంతో, అత్తమామల ఆమెపై చిత్రహింసలకు దిగారు.

Update: 2025-10-31 13:01 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో జరిగిన దారుణ ఘటన సమాజాన్ని తీవ్ర ఆవేశానికి గురిచేసింది. అందరూ కలిసి సంతోషంగా పెళ్లి చేశారు. ఏడాది తిరిగేలోపే బిడ్డ కూడా పుట్టాడు. అయితే భర్త అన్నకు పెళ్లైనా పిల్లలు లేరు. దీంతో అత్తమామలు కోడలి పాలిట యమదూతలుగా మారారు. భర్తతో పాటు బావతోనూ అనైతిక సంబంధం పెట్టుకుని పిల్లలు కనాలని హుకుం జారీ చేశారు. వద్దన్న చిన్నకోడలిని అత్తా, మామలు చిత్రహింసలకు గురిచేశారు. ఈ అమానుష చర్యలకు భర్త మౌనంగా ఉండటం, తల్లిదండ్రుల ఒత్తిడికి తలొగ్గడం మరింత కలకలం రేపింది. చివరికి మానవ హక్కుల సంఘాల  సహాయంతో పోలీసులు బాధితురాలిని రక్షించి, అత్యవసర చికిత్సకు తరలించారు. ఆంధ్రప్రదేశ్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఈ అమానవీయ సంఘటన చోటు చేసుకుంది. 

దారుణ ఘటన వివరాలు

జంగారెడ్డిగూడెం పట్టణానికి చెందిన రంజిత్ కుమార్‌తో పోలవరం గ్రామానికి చెందిన యువతికి రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. ఈ దంపతులకు ఏడాది క్రితం ఒక బాబు జన్మించాడు. అయితే, రంజిత్ కుమారు అన్న ప్రవీణ్‌కు వివాహం జరిగి ఎనిమిదేళ్లు అవుతున్నా పిల్లలు లేరు. ఈ విషయం ప్రవీణ్, రంజిత్ ల తల్లిదండ్రులను ఎప్పటి నుంచో వెంటాడుతోంది. ఎలాగైనా రంజిత్ కు పిల్లలు కలిగించాలని బలమైన కోరికతో ఉన్నారు. దీనికి వారి చిన్న కోడలు అంటే రంజిత్ భార్యను ఉపయోగించుకోవాలని కుట్రలు పన్నారు. అందులో భాగంగా అత్తామామలు బాధిత కోడలిపై ఒత్తిడి తెచ్చారు. "భర్తతో పాటు బావతోనూ సంసారం చేసి ప్రవీణ్‌కు వారసులు కలిగించాలి" అని చిన్న కోడలిని చిత్ర హింసలకు గురిచేయసాగారు. 

అయితే ఈ అనైతిక కోరికను బాధితురాలు తిరస్కరించడంతో, ఆమెపై అత్తమామల నుంచి చిత్రహింసలు పెంచడం మొదలు పెట్టారు. అయినా అత్తమామాల బలవంతానికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో వారు బరితెగించారు. ఆమెను, ఆమె ఏడాది చిన్నాభార్య కుమారుడిని ఇంటి ఒక గదిలో బంధించి చిత్రహింసలకు గురిచేయడం స్టార్ట్ చేశారు. ఆ గదికి కరెంట్ ను కట్ చేశారు. చీకటిలో బంధించారు. తిండి పెట్టడం మానేశారు. కనీసం మంచి తాగునీరు వంటి ప్రాథమిక సౌకర్యాలు కూడా ఏవీ అందించడం మానేశారు. గత పది రోజుల నుంచి ఇలాంటి నరకయాతన పెడుతున్నారు. ఈ అమానవీయ చర్యల వల్ల బాధితురాలు శారీరకంగా, మానసికంగా కుంగిపోయారు. భర్త రంజిత్ కుమార్ తన తల్లిదండ్రుల డిమాండ్‌కు మౌనంగా ఉండటంతో, ఆమెకు దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. 

రక్షణ, చికిత్స, చట్టపరమైన చర్యలు

అయితే ఈ దారుణ పరిస్థితి గురించి మానవ హక్కుల సంఘం నేతలకు సమాచారం అందింది. వెంటనే పోలీసుల సహాయంతో శుక్రవారం బాధితురాలు నివసిస్తున్న ఇంట్లోకి బలవంతంగా చొరబడ్డారు. గది తలలు పగలగొట్టి ఆమెను, ఆమె ఏడాది కుమారుడిని బయటకు తీసుకువచ్చారు. అనంతరం, ఆమె ఆరోగ్యం తీవ్రంగా దెబ్బతినడంతో దగ్గరలోని ఆసుపత్రికి తరలించి అత్యవసర చికిత్స అందించారు. 

పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు. అత్తా, మామలు తీవ్ర శిక్షలు అనుభవించాలని, బాధితురాలికి పూర్తి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని జంగారెడ్డిగూడెం పోలీస్ అధికారులు తెలిపారు. ఇలాంటి అమానవీయ హింసలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు పడాలని మానవ హక్కుల నాయకులు డిమాండ్ చేశారు. 

Tags:    

Similar News