గవర్నర్‌గా అశోక్‌గజపతిరాజు రేపు ప్రమాణస్వీకారం

టీడీపీ నుంచి ఇద్దరు నేతలకు గవర్నర్‌ పదవులు లభిస్తాయని ఎదురు చూశారు.;

Update: 2025-07-25 10:40 GMT

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి పూసపాటి అశోక్‌ గజపతిరాజు రేపు శనివారం గోవా గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. గోవాలోని గవర్నర్‌ బంగ్లా దర్బార్‌ హాల్‌లో శనివారం ఉదయం 11 గంటల సమయంలో ఆయన గోవా గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడుతో పాటు పులువురు టీడీపీ, జనసేన, బీజేపీ ఎంపీలు హాజరు కానున్నారు.

తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నాయకుడు అశోక్‌ గజపతి రాజు ప్రస్తుతం ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులుగా ఉన్నారు. గవర్నర్‌గా ఎంపిక కావడంతో ఆయన ఆ పార్టీ పదవికి రాజీనామా చేశారు. ఆ సమయంలో ఆయన ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. ఏళ్ల తరబడి తెలుగుదేశం పార్టీతో ఉన్న అనుబంధం వదులుకోవలసి వచ్చిందని ఆయన ఆవేదనకు లోనయ్యారు.
కూటమి ప్రభుత్వం అటు కేంద్రంలోను, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోను 2024లో కొలువుదీరిన తర్వాత తెలుగుదేశం పార్టీ నుంచి ఇద్దరు సీనియర్‌ నాయకులకు గవర్నర్‌ పదవులు దక్కుతాయనే చర్చ నడిచింది. అశోక్‌ గజపతిరాజుతో పాటు మరో సీనియర్‌ నాయకుడు యనమల రామకృష్ణుడికి కూడా గవర్నర్‌ పదవి లభిస్తుందని టీడీపీ వర్గాల్లో చర్చి సాగింది. దీని కోసం అశోక్‌ గజపతి రాజు, యనమల రామకృష్ణుడు ఇద్దరు ఎదురు చూశారు. చివరికి ఆ పదవి అశోక్‌ గజపతిరాజును వరించింది.
Tags:    

Similar News