సాహిత్య చరిత్రను మలుపు తిప్పిన ఆరుద్ర

సినీసాహిత్యచరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన పాటలెన్నో రాశారని తెలకపల్లి రవి అన్నారు.;

Update: 2025-08-31 13:01 GMT

ఆరుద్ర తెలుగు సాహిత్య చరిత్రను మలుపు తిప్పారని సీనియర్‌ జర్నలిస్టు, విశ్లేషకులు తెలకపల్లి రవి అన్నారు. సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం కర్నూలు నగరంలోని యూటీఎఫ్‌ భవనంలో ఆరుద్ర శతజయంతి ముగింపు సభకు ప్రధాన వక్త గా హాజరై ప్రసంగించారు. ముందుగా ఆరుద్ర చిత్ర పటానికి పూలమాల వేసి జోహార్లు అర్పించారు. ఏది రాస్తే అదే చరిత్ర..ఏం చెబితే అదే ప్రసంగం..అనబడిన కాలంలో వాస్తవసాహిత్యచరిత్రను తెలుగు సాహిత్యలోకానికి అందించడంతో తెలుగు సాహిత్యం కొత్తపుంతలు తొక్కిందని సమగ్రాంధ్రసాహిత్యం పదమూడు సంపుటాలతో తెలుగు పరిశోధకులకు సాహిత్యకారులకు, కవులకు పవిత్రగ్రంథమైందంటే అతిశయోక్తి కాదని ..కవిగా..చరిత్రకారుడిగా..నాటకకర్తగా, పద్యకవిగా ఎన్నో రచనలు చేసిన ఆరుద్ర అని అన్నారు.

తెలుగు సినీపాటల గేయరచయితగా నవశకాన్ని ఆరంభించారని దాదాపు వేల పాటలు రాసిన ఆరుద్ర సినీసాహిత్యచరిత్రలో అజరామరంగా నిలిచిపోయిన పాటలెన్నో రాశారన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర అధ్యక్షులు కెంగార మోహన్‌ మాట్లాడుతూ ఆరుద్ర రాసిన రచనలన్నీ నేటికీ ఆదరణ పొందుతున్నాయని కవిత్వమైన, నాటకమైన ఆరుద్ర కలం చేతుల్లో పదునెక్కాయన్నారు. వర్తమాన సాహిత్యలోనూ ఆరుద్ర ధ్రువతారే అన్నారు. సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు సభాద్యక్షతన జరిగిన ఈ సభలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్, యుటిఎఫ్‌ రాష్ట్ర సహాధ్యక్షులు కే సురేష్‌ కుమార్, నాయకులు యూఆర్‌ ఏ రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News