శ్రీవారికి వాడే ఆభరణాలు అసలైనవేనా..?

తిరుమలపై సాధువులు కొత్త సందేహాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. శ్రీవారికి అలంకరించే ఆభరణాలపై సందేహాలు వ్యక్తం చేశారు.

Update: 2024-09-24 11:11 GMT

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ వ్యవహారం ఓ పక్క ఆరనిచిచ్చులా మారింది. తాజాగా శ్రీవారికి అలంకరించే ఆభరణాలపై సందేహాల బీజం నాటారు.  స్వామివారికి అసలైన ఆభరణాలు వాడుతున్నారా? అని తెలంగాణ రాష్ట్రం కామారెడ్డికి చెందిన ఆశ్రమ పీఠాధిపతి కొత్త సందేహాన్ని తెరపైకి తెచ్చారు. శివకుమార్, భానుస్వాములతో కలిసి ఆయన మంగళవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. అలంకారప్రియుడైన శ్రీనివాసుడికి ఒకో రోజు ఒకో సేవ నిర్వహిస్తారు. ఉదయం స్వామివారికి అభిషేకం తరువాత స్వర్ణకచిత ఆభరణాలతో అలంకరిస్తారు. ఇలా ఒక రోజులో రెండుసార్లు గర్భాలయంలో స్వామివారికి అలంకరిస్తారు. దీనిని తోమాలసేవ కూడా అంటారు.

అలంకారప్రియుడు

తిరుమల శ్రీవారికి నిత్యం 12 రకాల పుష్పాలు, ఆరురకాల పత్రాలు మాలలుగా శ్రీవారి పాదాల నుంచి కిరీటం వరకు వివిధ రకాల పూలమాలలతో స్వామివారికి అలంకరించడం ఆచారం. "బ్రహ్మ కడిగిన పాదం" నుంచి అలంకరణ ప్రారంభం అవుతుంది. స్వామివారి మూలవిరాట్టుకు అలంకరించే పూలమాలలకు చక్కటి పేర్లు కూడా ఉన్నాయి. అంతేకాకుండా కటిహస్తం, కాసులహారం, యజ్నోపవీతం, కంఠాభరణాలు భుజకీర్తులు, శంఖుచక్రాలు. ఏడు వజ్రకిరీటాలు. మచ్చుకు ఇవి కొన్ని మాత్రమే. వజ్రాలు, కెంపు, పచ్చలు పొదిగిన అనేకానేక బంగారు ఆభరణాలు, రాయలవారు, అంతకుముందు ఆకాశరాజు సమర్పించిన కానుకలకు కొదవలేదు.
ప్రత్యేక వ్యవస్ధ
శ్రీవారికి సమయానుకూలంగా ఆగమశాస్ర్త పద్ధతులను అనుసరించి క్రమం తప్పకుండా, అలంకరించడం, నైవేద్యం సమర్పించడంలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా, పర్యవేక్షించడానికి ఆలయంలో ప్రత్యే వ్యవస్థ ఉంది. ఈ వ్యవహారాల పర్యవేక్షణకు టీటీడీ ఆగమ సలహాదారులు, ప్రధానార్చకులు ఉన్నారు. వారితో పాటు రాజుకు సైన్యాధిపతులు ఎలాగో తిరుమలలో పెద్దజీయర్, చిన్నజీయర్ స్వాములు అలాంటివారు.  శ్రీవారికి నిర్వహించే ఉదయాత్పూర సేవలను వారిద్దరూ పర్యవేక్షిస్తుంటారు. అయితే..

"తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో వాడే నెయ్యిలో కల్తీ జరిగింది" అని సీఎం ఎన్. చంద్రబాబు వ్యాఖ్యాల నేపథ్యంలో ప్రతి అంశం వివాదంగా తెరపైకి తెస్తున్నారు. భక్తులకు లేనిపోని సందేహాలు కలగడానికి ఆస్కారం కల్పిస్తున్నారు. రాజకీయ నేతల తీరు అలా ఉంటే.. సర్వసంగపరిత్యాగులు కూడా లేని సందేహాలు వ్యక్తం చేయడం ప్రస్తుతం కొత్త వివాదం తెరపైకి తెచ్చారు.
ఆభరణాలు అసలైనవేనా?

తిరుమల శ్రీవారికి అలంకరించే అభరణాలపై తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి ఆశ్రమ పీఠాధిపతి మహాదేవస్వామి కొత్త సందేహాన్ని తెరపైకి తెచ్చారు. లడ్డూ ప్రసాదంలో జరిగిన కల్తీ వ్యవహారంలో బాధ్యులను శిక్షించాలని ఆంధ్రప్రదేశ్ సాధు పరిషత్ తిరుపతి టీటీడీ పరిపాలన భవనం ముందు ధర్నా నిర్వహించింది. ఇక్కడి ప్రెస్ క్లబ్లో మంగళవారం శివకుమార్ , భాను స్వాములతో కలిసి మహాదేవస్వామి మీడియాతో మాట్లాడారు.
"నెయ్యి కొనుగోలులోనే ఇంత అవినీతి ఉంటే, సాక్షాత్తు ఆ వేంకటేశ్వరునికి అలంకరించే ఆభరణాలు అసలైనవేనా? నిజమైనవి వాడుతున్నారా" అని వ్యాఖ్యానించారు. " ఆ ఆభరణాలు కూడా మర్చేసి, నకిలీవి వాడుతున్నారా?" అనే అర్థం వచ్చే విధంగా వ్యాఖ్యానించారు.
లడ్డూ ప్రసాదంలో వాడిన నెయ్యి కల్తీ వ్యవహారంపై మాట్లాడుతూ,
"శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేసిన వారికి జీవించే హక్కు లేదు" అని మహదేవ్ ఆశ్రమ పీఠాధిపతి మహాదేవస్వామి వ్యాఖ్యానించారు. టీటీడీ పరిస్థితి అల్లకల్లోలంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. నెయ్యి కొనుగోలు చేయడం వల్లే కల్తీ జరుగుతోంది. గోశాలల సంఖ్య పెంచడం ద్వారా స్వచ్ఛమైన ఆవుపాలతో టీటీడీనే నెయ్యిని తయారు చేయాలని ఆయన సూచించారు.
అవకావం దొరికిందే చాటన్నట్లు ఎవరికి తోచిన తరుగా వారు తిరుమలపై ఆరోపణలేకాదు. సందేహాలు కూడా వ్యక్తం చేయడ ఫ్యాషన్ గా మారింది. చివరాఖరికి స్వామీజీలు, సాధువులు కూడా. దీనిపై టీటీడీ ఎలా స్పందిస్తుందనేది వేచిచూడాలి.
Tags:    

Similar News