ప్రకాశం జిల్లాలో బయటపడిన పురాతన ఆస్ట్రిచ్ గూడు, ఎన్నివేల ఏళ్ళనాటిదంటే...

చరిత్ర ఒక చిత్రమైన పుస్తకం. అన్నీ తెలుసు అన్నట్లే ఉన్నా తెలియనివి మరెన్నో బయటపడుతూనే ఉంటాయి. పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు చేసే కొద్దీ ఏదోక కొత్త విషయం వెలుగు చూస్తుంటుంది.

Update: 2024-06-25 12:47 GMT

చరిత్ర ఒక చిత్రమైన పుస్తకం. అన్నీ తెలుసు అన్నట్లే ఉన్నా తెలియనివి మరెన్నో బయటపడుతూనే ఉంటాయి. పురావస్తు శాస్త్రవేత్తలు తవ్వకాలు చేసే కొద్దీ ఏదోక కొత్త విషయం వెలుగు చూస్తుంటుంది. తాజాగా ఇటువంటి ఓ అద్భుతమైన విషయం ఒకటి ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లాలో బయటపడింది. అది ఒక పక్షి గూడు. అది ఏదో చిన్నా చితకా పక్షి కాదు.. ఆస్ట్రిచ్ పక్షి. జర్మనీ, యూఎస్, ఆస్ట్రేలియా సహా వడోదరలోని ఎంఎస్ విశ్వవిద్యాలయానికి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు చేసిన తవ్వకాల్లో ఈ విషయం బయటపడింది. ఈ ఆవిష్కరణ అందరినీ ఆలోచనలో పడేసింది. భారతదేశంలో ఆస్ట్రిచ్ పక్షులు 25వేల ఏళ్ల క్రితం సంచరించేవని 2017లో ఓ సంస్థ చేసిన అధ్యయనంలో వెల్లడైంది. దీంతో ఇప్పుడు ప్రకాశం జిల్లాలో లభించిన గూడు అన్ని వేల సంవత్సరాల క్రితందే అయితే.. ఇన్నాళ్లూ ఎలా నిలిచిందనేది శాస్త్రవేత్తల ముందున్న అతి పెద్ద ప్రశ్న.

అయితే ఈ ఆవిష్కరణ 25వేల ఏళ్ల క్రితంది కాదని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది ఏకంగా 41వేల సంవత్సరాల క్రితందని వారు స్పష్టం చేశారు. అప్పట్లో ప్రకాశం జిల్లా ప్రాంతాల్లో కూడా ఉష్ట్రపక్షులు సంచరించాయని ఈ గూడు నిదర్శనమని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఆవిష్కరణ సాదాసీదా ఆవిష్కరణ కాదని వారు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ గూడు 911 ఆస్ట్రిచ్ గుడ్లతో అత్యంత సుందరంగా, ఆకట్టుకునేలా ఉందని వారు చెప్పుకొచ్చారు. దాంతో పాటుగా 41వేల సంవత్సరాల క్రితం ఈ మెగాఫౌనల్ పక్షుల ప్రవర్తన, జీవన విధానం, ఆవాసాలు ఎలా ఉండేవి అనే అంశాలపై ఒక క్లారిటీని ఇస్తున్నాయని వారు వివరించారు.

శాస్త్రవేత్తల ప్రకారం.. ఈ గూడు 9 నుంచి 10 అడుగుల వెడల్పుతో, ఈ సమయంలో కూడా 30 నుంచి 40 గుడ్లను నిలపగలిగేలా ఉందని ఈ ఆవిష్కరణ చేసిన శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. భారతదేశంలో ఉండే మెగాఫ్యూనల్ జాతి పక్షులు ఎందుకు అంతరించి పోయాయో తెలుసుకోవడానికి ఈ ఆవిష్కరణ ఎంతో దోహదపడుతుందని ఎంఎస్ యూనివర్సిటీ ఆర్కియాలజీ, పురాతన చరిత్ర డిపార్ట్‌మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవర అనిల్ కుమార్ చెప్పారు. ‘‘1 నుంచి 1.5 మీటర్ల ప్రాంతంలో దాదాపు 3,500 గుడ్ల అవశేషాలు లభించడం భారతదేశ దక్షిణ భాగంలో ఆస్ట్రిచ్(ఉష్ట్ర) పక్షులు జీవించేవన్న వాస్తవాన్ని తెలుపుతున్నాయి. దాంతో పాటుగా ఇప్పటి వరకు లభించిన అతి పురాతన ఆస్ట్రిచ్ గూడు కూడా ఇదే’’ అని చెప్పారు అనిల్ కుమార్.

Tags:    

Similar News