సింగపూర్ వేదికగా జగన్ 'విధ్వంసం'పై ధ్వజమెత్తిన లోకేష్
సింగపూర్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అభిప్రాయపడ్డారు.;
By : The Federal
Update: 2025-07-28 10:22 GMT
‘గత ఐదేళ్ల విధ్వంస పాలన చూసి తెలుగువారంతా ముందుకొచ్చారు. రాష్ట్రాన్ని కాపాడుకునేందుకు విదేశాల్లోని తెలుగువారంతా ముందుకొచ్చారు. ఏదేశం వెళ్లినా సీఎం చంద్రబాబు, నేను తొలుత తెలుగువాళ్లను కలవాలని నిర్ణయించుకున్నాం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఏర్పాటు వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందుతోంది. ప్రధాని మోదీ త్వరలోనే సింగపూర్‌లో పర్యటిస్తారు. మోదీ పర్యటనలోనూ తెలుగువారంతా పాల్గొని విజయవంతం చేయాలి’’ అని లోకేశ్ చెప్పారు. సింగపూర్ అభివృద్ధి చెందిన తీరును స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ప్రస్తుతం సింగపూర్ పర్యటనలో ఉన్న ఆయన తెలుగు డయాస్పోరా వాలంటీర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు.
సింగపూర్ నుంచి నేర్చుకోవాల్సింది చాలా ఉందని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన ‘ఎక్స్’లో పోస్టు చేశారు. రాజకీయాల కంటే అభివృద్ధికి ప్రాధాన్యంపై ఆ దేశం నుంచి స్ఫూర్తి పొందాలన్నారు. ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) నాయకత్వంలో ఈ పర్యటనను సద్వినియోగం చేసుకుంటామన్నారు.