ఎమ్మెల్సీ అనంతబాబుకు హైకోర్ట్ లో చుక్కెదురు

డ్రైవర్ డోర్ డెలివరి కేసు పునర్విచారణకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.;

Update: 2025-07-25 13:09 GMT

డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్యచేసి డోర్ డెలివరీ చేశారన్న కేసులో వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుకు చిక్కులు తప్పడం లేదు. ఈ కేసును పునర్విచారణ చేయాలని రాజమండ్రి కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో సవాలు చేసిన అనంతబాబుకు చుక్కెదురైంది. అనంతబాబు పిటీషన్ను హైకోర్టు కొట్టి వేసింది. ఈ కేసును పునర్విచారణ చేయాలని రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ కేసు పునర్విచారణ చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టతనిచ్చింది. దీంతో ఈ కేసు పునర్విచారణకు అడ్డంకులు తొలగిపోయాయి. ఈ కేసులో ఏపీ ప్రభుత్వం ఇప్పటికే సిట్ ఏర్పాటు చేసింది. దర్యాప్తు ప్రారంభించిన సెట్ అధికారులు , అనంతబాబుకు సహకరించిన వారిపై ఫోకస్ పెట్టారు.90 రోజుల్లో విచారణ పూర్తి చేసే ఆలోచనలో సిట్ అధికారులు వున్నారు.

Tags:    

Similar News