పెట్రోల్ ధరలో ‘ఆంధ్రప్రదేశ్’ టాప్!
ఆంధ్రప్రదేశ్ లో పెట్రోల్ ధర భగ్గుమంటోంది. ఏ రాష్ట్రంలో లేని ధర ఏపీలో ఉంది.;
భారతదేశంలోని 28 రాష్ట్రాలు, 8 కేంద్ర పాలిత ప్రాంతాల్లో లీటరు పెట్రోల్ ధర అమ్మకంలో ఆంధ్రప్రదేశ్ టాప్ లో ఉంది. దేశంలోనే అత్యధికంగా లీటరు పెట్రోల్ రూ. 109.63లు అమ్ముతున్నారు. ఆదివారం అందుకున్న సమాచారం ప్రకారం గత కొద్ది రోజులుగా పెట్రోల్ ధరల్లో పెద్ద మార్పులు లేవు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, పన్నులు, స్థానిక అంశాల ఆధారంగా ధరలు మార్పు చెందే అవకాశం ఉంది.
ఆంధ్రప్రదేశ్ లో పాలకులు ఏ విషయంలోనూ తగ్గేదే లే... అంటున్నారు. దేశమంతా ఒక దారైతే మాదోదారి అంటున్నారు పాలకులు. ఏపీలో ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉంది. ఎన్డీఏ సర్కార్ అధికారంలో ఉన్న వేరే రాష్ట్రాల్లో కంటే ఏపీలో పెట్రోల్ ధర ఎందుకు ఎక్కువ ఉందో ప్రజలకు వివరించాల్సిన అవసరం పాలకులకు ఉంది.
ఏపీలో పెట్రోల్ ధర ఎక్కువకు కారణాలు...
ఏపీ ప్రభుత్వం పెట్రోల్‌పై అత్యధిక VAT (సుమారు రూ.29.06లు లీటరుకు) విధిస్తోంది. ఇది దేశంలోని అనేక రాష్ట్రాల కంటే ఎక్కువ. ఇది రిటైల్ ధరను ఎక్కువగా పెంచింది.
ఏపీకి పెద్ద రిఫైనరీలు దూరంగా ఉండటం వల్ల ఇంధన రవాణా ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని, అందువల్ల ఆ ఖర్చులు కూడా కలుపుకుని అమ్మకాలు చేస్తున్నారని పెట్రోల్ డీలర్లు చెబుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం విధించే ఎక్సైజ్ డ్యూటీ (రూ. 21.90/లీటరు), సీస్‌లు (సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ అండ్ సర్చార్జెస్) (Central Excise Duty and Surcharges) ఏపీలోనూ వర్తిస్తాయి. కానీ రాష్ట్ర పన్నులతో కలిసి ధర ఎక్కువగా మారుతుంది.
రాష్ట్రం GST రెవెన్యూ, కేంద్ర నిధులపై ఆధారపడి ఉండటం వల్ల, పెట్రోల్‌పై ఎక్కువ పన్నుల ద్వారా ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరం వచ్చిందనేది ప్రభుత్వంలోని పలువురు పెద్దలు చెబుతున్న మాట. ఇది ధరలను పెంచుతుంది. ఇంధన రిటైలర్ల మధ్య పోటీ తక్కువగా ఉండటం వల్ల ధరలు నియంత్రించకుండా ఉంటున్నాయి.
కర్ణాటక (రూ. 103.23), తమిళనాడు (రూ. 100.80) మాత్రమే. ప్రభుత్వం పన్ను సడలింపులు లేదా ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలను అన్వేషించడం ద్వారా ఈ సమస్యను తగ్గించే అవకాశం ఉంది. అతి తక్కువగా అండమాన్, నికోబార్ దీవుల్లో లీటరు పెట్రోల్ రూ. 82.46 కాగా, అస్సాంలో రూ. 90.24లు, మిజోరాం లో రూ. 90.29లుగా ఉంది.
దేశంలోని రాష్ట్రాల్లో లీటరు పెట్రోల్ ధరలు ఇలా ఉన్నాయి.
- ఆంధ్రప్రదేశ్: 109.63
- అరుణాచల్ ప్రదేశ్: 90.27
- అస్సాం: 90.24
- బీహార్: 105.60
- చత్తీస్‌గఢ్: 101.41
- గోవా: 95.49
- గుజరాత్: 94.71
- హర్యానా: 94.77
- హిమాచల్ ప్రదేశ్: 95.21
- జమ్మూ కాశ్మీర్: 96.49
- ఝార్ఖండ్: 97.53
- కర్ణాటక: 103.23
- కేరళ: 107.33
- మధ్యప్రదేశ్: 106.44
- మహారాష్ట్రా: 103.50
- మణిపూర్: 97.55
- మేఘాలయ: 90.32
- మిజోరాం: 90.29
- నాగాలాండ్: 90.72
- ఒడిశా: 101.11
- పంజాబ్: 95.26
- రాజస్థాన్: 104.69
- సిక్కిం: 101.55
- తమిళనాడు: 100.80
- తెలంగాణ: 107.46
- త్రిపుర: 97.15
- ఉత్తర ప్రదేశ్: 94.73
- ఉత్తరాఖండ్: 93.49
- పశ్చిమ బెంగాల్: 105.41
- అండమాన్ & నికోబార్ దీవులు: (కేంద్ర పాలిత ప్రాంతం) 82.46
- చండీగఢ్: (కేంద్ర పాలిత ప్రాంతం) 93.40
- దాద్రా & నగర్ హవేలీ: (కేంద్ర పాలిత ప్రాంతం) 94.49
- దమన్ & దియూ: (కేంద్ర పాలిత ప్రాంతం) 94.49
- ఢిల్లీ: (నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ) 94.77
- లక్షద్వీప్: (కేంద్ర పాలిత ప్రాంతం) 100.75
- పాండిచ్చేరి: (కేంద్ర పాలిత ప్రాంతం) 93.32
- లడక్ (కేంద్ర పాలిత ప్రాంతం) 102.57