అనంతపురం : ఎడ్లబండి ఎక్కిన కలెక్టర్
జిల్లా కలెక్టర్ సంప్రదాయ దుస్తులు ధరించారు. ఎడ్లబండిని తోలుతూ కలెక్టరేట్ కు చేరారు.;
Byline : SSV Bhaskar Rao
Update: 2025-03-30 06:26 GMT
తెలుగువారి లోగిళ్లలో ఉగాది పండుగ కొత్తదనం తెచ్చింది. తెలుగువారికి ఇది తొలిపండుగ. పల్లెలు పట్టణాలే కాదు. కార్యాలయాలు కూడా కళకళాలాడాయి. అనంతపురం జిల్లాలో మాత్రం ఉగాదిని ప్రత్యేకంగా నిర్వహించారు. తెలుగుదనం ఉట్టిపడింది. అధికారులు, సిబ్బంది సంప్రదాయ దుస్తులు ధరించారు. ఇంతవరకు బాగానే ఉంది.
అనంతపురం జిల్లా కలెక్టర్, జాయింగ్ కలెక్టర్, మిగతా జిల్లా అధికారులు ఉగాది పండుగను వినూత్నంగా నిర్వహించారు. మామిడి ఆకులు, టెంకాయ మట్టలు కట్లారు. చెండుమల్లి పూలతో ఎడ్లబండిని సుందరంగా అలంకరించారు. సంప్రదాయ దుస్తులు ధరించిన జిల్లా కలెక్టర్ చెర్నాకోలా ఓ చేతిలో, పగ్గాలు మరోచేతిలో పట్టుకున్నారు. ఎడ్లను నియంత్రిస్తూ, బండి తోలడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
జిల్లా కలెక్టరేట్ వద్దకు ఐఏఎస్ అధికారి వినోద్ కుమార్ పంచకట్టు సంప్రదాయ దుస్తులతో చురుకున్నారు. అప్పటికే సిద్దం చేసినే ఎడ్లబండి తోలుకుంటూ రెవెన్యూ భవన్ వద్దకు చేరుకున్నారు. ఈ కార్యక్రమం పూర్తిగా సందప్రదాయబద్ధంగా నిర్వహించడానికి అనంతపురం జిల్లా అధికారులు ప్రత్యేకత చాటుకున్నారు. రెవెన్యూయ భవన్ వద్ద జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వి, జాయింట్ కలెక్టర్ శివనారాయణ్ శర్మను మంగళ వాయిద్యాలతో స్వాగతించారు.
డిఆర్ఓ ఏ.మాలోల, ఆర్డీఓ కేశవ నాయుడు, జిల్లా అధికారులు, ఈ కార్యక్రమాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించడానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారు. అనంతరం శ్రీవిశ్వావసు నామ సంవత్సర ఉగాది ఉత్సవాలను పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రారంభించారు. ఈ కార్యక్రమాలను జ్యోతి ప్రజ్వలన చేయడం ద్వారా జిల్లా కలెక్టర్ ప్రారంభించారు.
ఉగాది ఉత్సవాల్లో జిల్లా అధికారులు, ప్రజలు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పంచాగ శ్రవణం చేశారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి రప్పించిన కవులు పదాలతో అల్లిన కవితలతో ఉగాది విశిష్ఠతను వివరించడం ఆకట్టుకుంది.