బాబూ.. శ్రీవారిసేవకు రండి...

బ్రహ్మోత్సవాలకు సీఎంను ఆహ్వానించిన టీటీడీ చైర్మన్.;

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-17 08:24 GMT

తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సీఎం నారా చంద్రబాబును టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆహ్వానించారు. తిరుమల శ్రీవారి వేదపండితులను వెంట తీసుకున్న టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ సీహెచ్. వెంకయ్యచౌదరి ఉండవల్లికి చేరుకున్నారు. బ్రహ్మోత్సవాల ఆహ్వానపత్రికను సీఎం నారా చంద్రబాబుకు చైర్మన్ బీఆర్. నాయుడుతో పాటు ఈఓ అనిల్ కుమార్ అందించారు. శ్రీవారి ఉత్సవాలకు హాజరువాలని ఆహ్వానం పలికారు. వేదపండితులు సీఎం చంద్రబాబుకు ఆశీర్వచనలు అందించారు. అనంతరం చైర్మన్ బీఆర్. నాయుడు శ్రీవారి లడ్డూ ప్రసాదాలు అందించారు.

సీఎం నారా చంద్రబాబుకు శ్రీవారి లడ్డూప్రసాదాలు అందిస్తున్న టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, వేదపండితులు

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఈ నెల 23వ తేదీ రాత్రి అంకురార్పణ జరుగుతుంది. 24వ తేదీ రాత్రి పెదశేషవాహనంపై ఉభయ దేవేరులతో కలిసి మలయ్య పల్లకీపై మాడవీధుల్లో విహరిస్తూ, భక్తులకు దర్శనం ఇవ్వడం ద్వారా వాహనసేవలు ప్రారంభం అవుతాయి.
శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్–2025ను తిరుమలలో మంగళవారం ఆవిష్కరించిన విషయం తెలిసిందే.
శ్రీవారికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి పట్టువస్త్రాలు సమర్పించడానికి ఈ నెల 24వ తేదీ సీఎం నారా చంద్రబాబు హాజరుకానున్నారని టీటీడీ చైర్మన్ తెలిపారు. దీనికి తగిన ఏర్పాట్లతో పాటు తిరుమలలో యాత్రికుల కోసం నిర్మించిన కొన్ని భవనాలు కూడా సీఎం చంద్రబాబు ప్రారంభించడానికి ఏర్పాట్లు జరిగాయని చైర్మన్ బీఆర్. నాయుడు వెల్లడించరాు.
సీఎంకు ఆహ్వానం
తిరుపతి నుంచి టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు, బోర్డు సభ్యరాలు జానకీదేవితో కలిసి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరితో వెలగపూడిలోని సీఎం నారా చంద్రబాబు క్యాంప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఆహ్వానపత్రిక అందించారు. ఆ తరువాత తీర్ధప్రసాదాలు కూడా సీఎం చంద్రబాబుకు అందించారు.
తిరుమలలో బ్రహ్మోత్సవాల నిర్వహణపై సీఎం చంద్రబాబు అధికారులతో వాకబు చేశారని తెలిసింది. యాత్రికులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా కల్పిస్తున్న ఏర్పాట్లను చైర్మన్ బీఆర్. నాయుడు వివరించారు. వసతి సదుపాయంతో పాటు భద్రతాపరంగా తీసుకుంటున్న చర్యలు కూడా వివరించారని అధికారవర్గాల ద్వారా తెలిసింది.
తిరుమలలో బ్రహ్మోత్సవాల వేళ యాత్రికులకు శ్రీవారి లడ్డూ ప్రసాదాలు నిలువ ఉంచడానికి తీసుకున్న ముందస్తు చర్యలపై ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈఓ వెంకయ్య చౌదరి వివరించారు.
తిరుమలతో పాటు తిరుపతిలో యాత్రికుల కోసం చేస్తున్న ఏర్పాట్లు, రవాణా సదుపాయాలకు సంబంధించిన వివరాలు సీఎం చంద్రబాబుకు టీటీడీ అధికారులు నివేదించినట్లు సమాచారం. బ్రహ్మోత్సవాలకు వచ్చే యాత్రికులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ, లోటుపాట్లకు ఆస్కారం లేకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు టీటీడీ అధికారులకు ప్రత్యేకంగా సూచనలు చేసినట్లు సమాచారం.
Tags:    

Similar News