అమరావతి కల నిజమవుతుంది
ఆంధ్రప్రదేశ్ లోని అమరావతిలో పునర్నిర్మాణ పనులు ప్రారంభిస్తూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ;
అమరావతి పుణ్యభూమి పై ఈరోజు నేను నిలబడి ఉన్నప్పుడు కల నిజమవుతుందనే భావన కనిపిస్తుంది. ఇక్కడ బౌద్ధ వారసత్వానికి సంబంధం ఉంది. రూ. 60వేల కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసుకున్నాం. వికసిత్ భారత్ వైపు వెళుతున్నామని ప్రధాన మత్రి నరేంద్ర మోదీ అన్నారు.
అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభించేందుకు వచ్చిన ప్రధాన మంత్రి మోదీ పైలాన్ ను ప్రారంభించి సభలో మాట్లాడారు. వీరలింగేశ్వర, అమరలింగేశ్వర, తిరుపతి వెంకన్న స్వామి పాదాలకు వందనం చేస్తన్నాను. మిత్రులారా ఇంద్రుడి తాలూకా రాజధాని తెలుసు. స్వర్ణాంధ్ర ప్రదేశ్ రాష్ట్ర నిర్మానానికి నాంది పలుకుదాం. అమరావతి ఒక నగరం కాదు. అధునాతన ఆంధ్రప్రదేశ్ గా మర్చే శక్తి అని ప్రధాని మోదీ అన్నారు.
అమరావతి రాజధాని గురించి ఆయన చాలా గొప్పగా ప్రశంసించారు.
"కాంక్రీట్ నిర్మాణాలు కాదు. ఏపీ ప్రగతికి, వికసిత్ భారత్‌కు బలమైన పునాదులు. ఇలాంటి అమరావతి రాజధాని నిర్మాణానికి పూనుకున్నందుకు చంద్రబాబు, పవన్ కల్యాణ్‌కు అభినందనలు. ఇంద్రలోకం రాజధాని అమరావతి. ఇప్పుడు ఏపీ రాజధాని పేరు కూడా అమరావతే. స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మాణానికి ఇది శుభ సంకేతం. ఏపీని ఆధునిక ప్రదేశ్, అధునాతన ప్రదేశ్‌గా మార్చే శక్తిగా అమరావతి తయారవుతుంది. ఏపీ యువత కలలు సాకారమయ్యే రాజధానిగా అమరావతి ఎదుగుతుంది. ఐటీ, ఏఐ సహా అన్ని రంగాలకూ అమరావతి గమ్యస్థానంగా మారుతుంది. హరితశక్తి, స్వచ్ఛ పరిశ్రమలు, విద్య, వైద్య కేంద్రంగా అమరావతి రూపుదిద్దుకుంటుంది,"అని ఆయన అన్నారు.
చంద్రబాబును దేశంలోనే గొప్ప నేత
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీకీ ఆధ్యుడని, ఆయన నుంచి తానుచాలానేర్చుకున్నాని ప్రధాని అన్నారు. "టెక్నాలజీ నాతో మొదలైనట్లు బాబు ప్రశంసిస్తున్నారు. ఇక్కడ నేను మీకొక రహస్యం చెబుతున్నాను. నేను గుజరాత్ సీఎం అయిన కొత్తలో హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడు ఐటీని ఎలా అభివృద్ధి చేశారో గుమనిస్తూ వచ్చాను. అధికారుల్ని పంపించి హైదరాబాద్ ఐటీ అభివృద్ధిని అధ్యయనం చేసిరమ్మని చెప్పాను. ఆయననుంచి టెక్నాలజీని ఏలా వాడాలోతెలుసుకున్నా. పెద్ద ప్రాజెక్టులు చేపట్టాలన్నా త్వరగా పూర్తి చేయాలన్నా చంద్రబాబుకే సాధ్యం. పెద్ద పెద్ద పనుల్ని చేపట్టి పూర్తి చేయడంలో చంద్రబాబును మించిన నేత దేశంలో లేరు. 2015లో ప్రజా రాజధానిగా అమరావతి నిర్మించడానికి శంకుస్థాపన చేశాను. గత పదేళ్లలో అమరావతికి కేంద్రం అండగా నిలిచింది. రాజధాని అభివృద్ధికి అభివృద్ధికి అన్ని రకాలుగా సహకరించింది. ఇప్పుడూ అమరావతి అభివృద్ధికి కేంద్రం సహకారం కొనసాగుతుంది. అమరావతిలో అన్ని రకాల నిర్మాణాలకు ఇన్ ఫ్రా స్ట్రక్చర్ నిర్మాణానికి కేంద్రం మద్దతు ఉంటుంది,” అని ప్రధాని అన్నారు.
ప్రజా రాజధానిని మనమే చేయాలి
ఇపుడు రాజధానిలో హైకోర్టు, సచివాలయం, రాజ్ భవన్ వంటి నిర్మాణాలకు ప్రభుత్దవం ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. ‘ఎన్టీఆర్ గారు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కోసం కలలు కన్నారు. మనం అందరం కలిసి ఎన్టీఆర్ కలలు నిజం చేయాలి. చంద్రబాబు, పవన్ కల్యాన్ కలిసి చేయాలి. ఇది మనం చేయాలి. మనమే చేయాలి,’ అని చెప్పారు.
పదేళ్లలో భారత దేశం మౌలిక వసతులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఒకటి కాబోతోంది. ఆంధ్రప్రదేశ్ లో కనెక్టివిటీకి ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. పక్క రాష్ట్రాలతో అనుసంధానం మెరుగు పడుతుంది. రైతులు పంటను రవాణా ద్వారా బాగా అమ్మకోవచ్చు. రేణిగుంట నుంచి తిరుపతి తక్కువ సమయంలో వెళ్లి వెంకన్న దర్శనం చేసుకుంటారు. అని కనెక్టివిటీ గురించి మాట్లాడారు.
రైల్వేలకు రికార్డు స్థాయిలో నిధులు పెంచాం
ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందిన దేశాలు రైల్వే మీద దృష్టి పెట్టామని కేంద్రం రికార్డు స్థాయిలో నిధులు పెంచామని ప్రధాని అన్నారు. "ఒకప్పుడు ఏపీ, తెలంగాణకు రైల్వే బడ్జెట్ రూ.900 కోట్లలోపే ఉండేది.ఇప్పుడు ఒక్క ఏపీకే రూ.9 వేల కోట్ల రైల్వే నిధులు ఇచ్చాం
ఏపీకి గతం కంటే పదిరెట్లు అధికంగా నిధులు కేటాయించాం.గత పదేళ్లలో ఏపీలో 750 రైల్వే బ్రిడ్జిలు, అండర్‌పాస్‌లు నిర్మించాం. ఏపీకి వందేభారత్, అమృత్ భారత్ రైళ్లు కేటాయించాం. ఏపీలో 70కి పైగా రైల్వేస్టేషన్లను అమృత్ భారత్ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్నాం," అని ప్రధాని తెలిపారు.
ఆయన ఇంకా ఏమన్నారంటే...
నేను ఎర్రకోట నుంచి స్పష్టంగా చెప్పాను. వికసిత్ భారత్ కావాలంటే రైతు, యువకులు ముందుండాలన్నారు. రైతు ప్రయోజనాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. రూ. 12 లక్షల కోట్లు ఎరువుల కోసం ఇచ్చాం. రూ. 5,500 కోట్లు పిఎం కిసాన్ కింద రైతులకు నష్టపరిహారం ఇచ్చాం అన్నారు.
పోలవరం త్వరగా పూర్తవడానికి కలిసి పనిచేస్తాం
దేశ వ్యాప్తంగా ఇరిగేషన్ ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. రైతుకు నీటి సమస్య రాకూడదు. పోలవరం ప్రాజెక్టు పనులు వేగం పుంజుకుంది. పోలవరం త్వరగా పూర్తవ్వాలని, ప్రాజెక్టును పూర్తికి కలిసి పనిచేస్తామని తెలియజేస్తున్నాను. మన ఆంధ్రభూమి దశాబ్దాలుగా కోట్లాది మంది భారతీయులను దేశ రక్షణను బలోపేతం చేసే కొత్త డీఆర్డీవో ను లాంచ్ చేశాం. దుర్గమ్మ లాగా శక్తిని ఇస్తుంది అన్నారు.
అనేక నరగాల్లో ఏక్తా మాల్స్ నిర్మిస్తాం..
భారత్ శక్తి ఐక్యతలో ఉంది. దేశంలో అనేక నరగాల్లో ఏక్తా మాల్స్ నిర్మించ బోతున్నాం. ఈరోజు విశాఖపట్నంలో నిర్మించేందుకు శంకుస్థాపన చేశాం. ఇక్కడ అన్ని చేతి వృత్తులు ఉత్పత్తుల విక్రయించేందుకు వీలుంటుంది. ఏక్ భారత్, శ్రేష్ట్ భారత్ అనే భావనను మరింత బలోపేతం చేస్తుందని భావిస్తున్నానని అన్నారు.
యోగా దినం వరల్డ్ రికార్డు సాధించాలి
అంతర్జాతీయ యోగా దినం కు నన్ను ఆహ్వానించినందుకు నేను సంతోషిస్తున్నను. ఆంధ్రాలో యోగ ప్రచారం చేయడం కాదు. ప్రపంచడం అంతా ఆంధ్రా వైపు చూడాలి. ప్రతి ఊర్లో, వీధిలో, వార్డులో, ఇంట్లో యోగా చేయాలి. వరల్డ్ రికార్డు సాధించేలా చేయాలి. మీ అందరి సమక్షంలో విశాఖలో ఏర్పాటు చేయబోయే కార్యక్రమానికి నేను తప్పకుండా వస్తాను అని హామీ ఇచ్చారు.
అమరావతి పూర్తయితే ఊహించని స్థాయికి జీడీపీ
ఆంధ్రప్రదేశ్ లో కలలు కనే వాళ్ల సంఖ్య తక్కువేమీ కాదు. అభివృద్ధిలో వేగంతో ముందకు వెళుతోంది. దానిని కొనసాగించాలి. ఈ వేగాన్ని పెంచుతూ ఉండాలి. సీఎం చంద్రబాబు మూడు సంవత్సరాల్లో అమరావతి పననులు పూర్తి చేస్తానన్నారు. అప్పుడు జీడీపీ ఏ స్థాయికి వెళుతుందో నేను ఊహించగలను. అది ఆంధ్రప్రదేశ్ చరత్ర మార్చ గలదు. మీ భుజంతో పాటు నా భుజం కూడా కలపి పనిచేస్తాను. కూటమి అభివృకి కట్టుబడి ఉంటుంది అని ప్రధాన మంత్రి మోదీ తన ప్రసంగాన్ని ముగించారు.
ఈసభలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్, భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, పి నారాయణ, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, తాడికొండ ఎంఎల్ఎ టి శ్రావణ్ కుమార్, సిఎస్ కె విజయానంద్, డిజిపి హరీశ్ కుమార్ గుప్త, పలువురు రాష్ట్ర మంత్రులు, ఎంపి, ఎంఎల్సీలు, ఎంఎల్ఏలు, అధికారులు, రాజధాని సహా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.