అమరావతి సభ సక్సెస్‌..అందరికీ అభినందనలు

మోదీ పర్యటన, అమరావతి కార్యక్రమం విజయవంతమైందనే సంతోషంలో సీఎం చంద్రబాబు ఉన్నారు.;

Update: 2025-05-03 05:25 GMT

రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రజలకు, ప్రభుత్వ అధికారులకు, భాగస్వామ్య పక్షాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు ధన్యవాదాలు, అభినందనలు తెలిపారు. ఇంకా చంద్రబాబు ఏమన్నారంటే..

ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగిన రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలకు, రాజధాని రైతులకు, కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన ప్రభుత్వ యంత్రాంగానికి, అధికారులకు, మంత్రులకు, ప్రజాప్రతినిధులకు, కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిన మీడియా, సోషల్‌ మీడియా వారికి కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ప్రజల సహకారంతో, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో, పక్కా ప్రణాళికతో అందరికీ అవకాశాలు సృష్టించేలా, రాష్ట్రానికి చోదక శక్తిగా నిలిచేలా, ఫ్యూచర్‌ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తాం. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధించి.. మాకు అండగా ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం అని తెలుపుతూ.. ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంటూ సీఎం చంద్రబాబు శనివారం పేర్కొన్నారు.
Tags:    

Similar News