AlluArjun and KIMS|కిమ్స్ ఆసుపత్రిలో అల్లుఅర్జున్
ఆసుపత్రిలో గడచిన నెలరోజులుగా చికిత్స చేయించుకుంటున్న శ్రీతేజ్ ను అల్లుఅర్జున్ పరామర్శించాడు.;
పుష్పసినిమా హీరో అల్లుఅర్జున్ కిమ్స్ ఆసుపత్రిని మంగళవారం ఉదయం వెళ్ళాడు. ఆసుపత్రిలో గడచిన నెలరోజులుగా చికిత్స చేయించుకుంటున్న శ్రీతేజ్ ను అల్లుఅర్జున్ పరామర్శించాడు. ఆసుపత్రిలోని 12వ అంతస్తులోని ఐసీయూలో ఉన్న శ్రీతేజ్ దగ్గర పుష్ప(Pushpa) సుమారు 20 నిముషాలు గడిపాడు. శ్రీతేజ్ కు వైద్యంచేస్తున్న డాక్టర్ల బృందంతో తాజా పరిస్ధితిని అడిగి తెలుసుకున్నాడు. వైద్యానికి ఎంతఖర్చయినా తానుభరిస్తాను కాబట్టి అవసరమైన అన్నీ మార్గాల్లో చికిత్స అందించాలని అల్లుఅర్జున్(AlluArjun) డాక్టర్లకు హామీ ఇచ్చాడు. ఇప్పటికే పుష్ప సినిమా యూనిట్ నుండి శ్రీతేజ్ వైద్యం కోసం రు. 2 కోట్లు అందిన విషయం తెలిసిందే. అల్లుఅర్జున్ కోటి రూపాయలు ఇవ్వగా డైరెక్టర్ సుకుమార్, నిర్మాతలు చెరీ రు. 50 లక్షలు అందించారు.
నిజానికి మొన్నటి ఆదివారమే అల్లుఅర్జున్ ఆసుపత్రికి చేరుకుని పిల్లాడిని పరామర్శించాలని అనుకున్నాడు. అయితే అందుకు పోలీసులు అభ్యంతరం వ్యక్తంచేశారు. ఆదివారం చిక్కడిపల్లి పోలీసుల విచారణకు హాజరైన పుష్ప అక్కడినుండే ఆసుపత్రికి వెళ్ళాలని అనుకున్నాడు. అయితే ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి వెళితే మళ్ళీ ఏదైనా అవాంచనీయమైన ఘటనలు జరిగే అవకాశముందని పోలీసులు హెచ్చరించటంతో అల్లుఅర్జున్ నేరుగా తనింటికి వెళ్ళిపోయాడు. ఇదేవిషయమై రామ్ గోపాల్ పేట్ పోలీసులు కూడా అల్లుఅర్జున్ కు నోటీసులు జారీచేశారు. తమకు ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఆసుపత్రికి చేరినపుడు అక్కడ ఏదైనా జరగకూడని ఘటన జరిగితే అందుకు పూర్తి బాధ్యత వహించాల్సుంటుందని అల్లుఅర్జున్ ను హెచ్చరించారు. తమకు ముందుగా సమాచారం ఇస్తే అందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్లు చేస్తామని చెప్పారు.
ఆసుపత్రికి అల్లుఅర్జున్ ను వెళ్ళద్దని పోలీసులు చెప్పలేదు. కాకపోతే అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకునేందుకు తమకు సమాచారం ఇవ్వాలని మాత్రమే చెప్పారు. పోలీసులు చెప్పినట్లే ఈరోజు ఉదయం తాను ఆసుపత్రికి వెళ్ళాలని అనుకుంటున్నట్లు అల్లుఅర్జున్ ఇచ్చిన సమాచారం ప్రకారం పోలీసులు ఆసుప్రతి దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు. దాంతో ఆసుపత్రి దగ్గర ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరామర్శ కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది.
డిసెంబర్ 4వ తేదీ పుష్ప సినిమా విడుదల సందర్భంగా సంధ్యా ధియేటర్(Sandhya Theatre) కు అల్లుఅర్జున్ రావటంతో తొక్కిసలాట(Pushpa Stampeding) జరిగిన విషయం తెలిసిందే. ఆ తొక్కిసలాటలో రేవతి మరణించగా ఆమెకొడుకు శ్రీతేజ్ స్పృహతప్పిపడిపోయాడు. చివరకు తొక్కిసలాటలో రేవతి మరణించగా ఊపిరి సరిగా అందక ఇబ్బంది పడుతున్న శ్రీతేజ్ ను పోలీసులే ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటినుండి పిల్లాడు కోమాలోనే ఉన్నాడు. మధ్యలో కోలుకుంటున్నాడని వైద్యులు చెప్పినా మళ్ళీ పరిస్ధితి విషమించిందని సమాచారం. అందుకనే శ్రీతేజ్ ను అల్లుఅర్జున్ పరామర్శించింది.