పొగాకు కొనుగోళ్లకు 150 కోట్లు కేటాయించండి
సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ భేటీ అయ్యారు.;
టొబాకో బోర్డు ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు కొనుగోళ్ల నిమిత్తం రూ.150 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి పియూష్ గోయల్‌ను కోరారు. ఉండవల్లి నివాసంలో సీఎం చంద్రబాబుతో ఆదివారం కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ భేటీ అయ్యారు. ఈ భేటీలో రాష్ట్రంలోని వివిధ అంశాలపై ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి మధ్య చర్చ జరిగింది. మరి ముఖ్యంగా బ్లాక్ బర్లీ పొగాకు కొనుగోళ్లు, పామాయిల్‌పై దిగుమతి సుంకం తగ్గింపు, ఆక్వా ఎగుమతులు, మ్యాంగో పల్ప్ పై జీఎస్టీ తగ్గింపు వంటి పలు అంశాల మీద ఇరువురు చర్చించారు. ఈ సందర్భంగా పొగాకు ధరలు తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వమే రూ.300 కోట్లతో 20 మిలియన్ కేజీలు కొనుగోలు చేస్తున్నట్టు సీఎం చంద్రబాబు కేంద్ర మంత్రికి వివరించారు. అయితే ఇందులో రూ. 150 కోట్లు టొబాకో బోర్డు భరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.