తిరుమలలో యాత్రికుల వసతికి ఇక సమస్య లేదబ్బా..

రూ. 102 కోట్ల భవనాన్ని ప్రారంభించిన ఉపరాష్ట్రపతి, సీఎం

Byline :  SSV Bhaskar Rao
Update: 2025-09-25 08:02 GMT

తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు గది దొరకలేదనే సమస్య లేదు. ముందుగా గది బుక్ చేసుకోకుండా తిరుమలకు వచ్చినా ఇబ్బంది లేదు. 4,000 మందికి వసతి కల్పించే భవనం అందుబాటులోకి తెచ్చారు.

తిరుమలలో 102 కోట్ల రూపాయలతో నిర్మించిన యాత్రికుల వసతి సముదాయం ( pilgrim amenities complex PAC) భవనాన్ని భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గురువారం ఉదయం ప్రారంభించారు. ఆధునిక వసతులు అందుబాటులోకి తీసుకుని వచ్చిన టీటీడీ అధికారులను సీఎం చంద్రబాబు అభినందించారు.


"యాత్రికులకు వసతి, మంచి దర్శనం కల్పించడంలో ఏమాత్రం రాజీలేకుండా సేవలు అందించండి" అని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అన్నప్రసాదాల తయారీ, వడ్డించడంలో కూడా నాణ్యతకు ప్రాధాన్యత ఇవ్వాలని మరోసారి ఆయన గుర్తు చేశారు. శ్రీవారి నిలయంలో ఎలాంటి అపసవ్య పరిస్థితులకు ఆస్కారం ఇవ్వకుండా చిత్తశుద్ధితో పనిచేయాలని కూడా సీఎం చంద్రబాబు సూచించారు.

తీరిన వసతి సమస్య
తిరుమలలో ప్రస్తుతం 6,500 వివిధ రకాల గదులు అందుబాటులో ఉన్నాయి. వాటిలో స్పెషల్ టైప్ కాటేజీలు, వివిఐపీలు, సాధారణ యాత్రికులకు వస్తే కల్పించడానికి గదులు అందుబాటులో ఉంచింది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో 3500 గదులు ఆఫ్ లైన్ లో అందుబాటులో ఉంచినట్లు టీటీడీ కార్యనిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు.
"తిరుమల దర్శనానికి వచ్చే యాత్రికులకు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకుని గదులు తీసుకోవచ్చు" అని కూడా ఆయన చెప్పారు. సాధారణ రోజులకు భిన్నంగా బ్రహ్మోత్సవాల వేళ సామాన్య భక్తులు వసతికి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసినట్లు కూడా ఆయన వివరించారు. ఇదిలా ఉంటే..
పీఏసీ-5 యాత్రికుల వసతి

తిరుమలలో ముందస్తుగా వసతి సదుపాయం గదులు బుక్ చేసుకోకుండా వచ్చే యాత్రికులకు ఇప్పటివరకు నాలుగు యాత్రికుల వస్తే సముదాయాలు అందుబాటులో ఉన్నాయి. బ్రహ్మోత్సవ వేళ తిరుమలలో పిలిగ్రిమ్ ఎమెనిటీస్ కాంప్లెక్స్ 5 ను అందుబాటులోకి తీసుకువచ్చారు. 102 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ భవనంలో యాత్రికులకు వసతితోపాటు భోజన సదుపాయాన్ని కూడా అందుబాటులో ఉంచారు. ఈ భవనాన్ని భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, సీఎం నారా చంద్రబాబు ప్రారంభించారు.
వసతి సదుపాయాలు
తిరుమల క్షేత్రంలో వెంకటాద్రి నిలయం పేరిట నిర్మించిన యాత్రికుల వసతి భవనంలో రద్దీకి అనుగుణంగా వసతులు కల్పించారు. అందులో ప్రధానంగా..
ఈ భవనంలో నాలుగు వేల మందికి వసతి అందుబాటులోకి వచ్చింది. యాత్రికులు విశ్రాంతి తీసుకున్నందుకు 16 డార్మెటరీలు నిర్మించారు. తమ వస్తువులను భద్రపరుచుకునేందుకు 2400 లాకర్లను కూడా అందుబాటులో ఉంచారు. వేసవిలో ప్రధానంగా చలికాలం యాత్రికుల్లో పిల్లలను కూడా దృష్టిలో ఉంచుకొని 24 గంటలు వేడి నీటిని అందించడానికి కూడా ఏర్పాట్లు చేశారు.
తలనీలాల సమర్పణ

 శ్రీవారికిమొక్కులు చెల్లించుకునేందుకు వీలుగా యాత్రికులు ఇబ్బంది పడకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. తలనీలాలు సమర్పించడానికి కళ్యాణ కట్ట వద్దకు వెళ్లకుండా ఇప్పటికే తిరుమలలోని వసతి గృహాల సముదాయంలోనే క్షురకులను అందుబాటులో ఉంచారు. అదేవిధంగా పిఎసి ఫైవ్ లో కూడా 80 మంది యాత్రికులు ఒకేసారి కాలనీలాలు సమర్పించే విధంగా కళ్యాణకట్టను ఏర్పాటు చేశారు.
తిరుమలలో తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం తో పాటు అనేక కాటేజీల్లో అన్న ప్రసాదాల వితరణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. వాటి మాదిరి అధునాతన సదుపాయాలతో నిర్మించిన పిఎసి ౫లో యాత్రికుల వసతి సముదాయంలో కూడా అన్న ప్రసాదాలు పంపిణీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఈ కేంద్రంలో ఒకేసారి 1,400 మంది అన్న ప్రసాదాలు స్వీకరించే విధంగా రెండు భోజన శాలలను నిర్మించారు.

సేవలు ఇలా:
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల కోసం టిటిడి విజిలెన్స్, పోలీస్ విభాగాలు భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాయి. సాధారణంగా ఆన్లైన్, ఆఫ్లైన్లో వసతి గది, సర్వదర్శనం నుంచి ఆర్జిత సేవలు వరకు స్వామివారి దర్శనానికి టికెట్ తీసుకోవడానికి కచ్చితంగా ఆధార్ కార్డు తో పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా..
రిజిస్ట్రేషన్ తప్పనిసరి

పిఏసి 5 లో విశ్రాంతి తీసుకోవడానికి యాత్రికులు కచ్చితంగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఈ భవనంలోనే ప్రత్యేకంగా బుకింగ్ టోకెన్ కేంద్రాన్ని అందుబాటులో ఉంచారు. ఇక్కడికి వచ్చే యాత్రికులు వసతి సదుపాయం కోసం ఈ కేంద్రంలో రిజిస్ట్రేషన్ చేయించుకోవలసి ఉంటుంది. అంటే ఎంతమంది యాత్రికులు వస్తున్నారు అనే విషయంలో లెక్కలు తేలడంతో పాటు వారి భద్రతకు కూడా ఇది ఉపయోగపడుతుందనేది టీటీడీ అధికారులు చెబుతున్నారు.
తొలి టోకెన్ జారీ

తిరుమలలో గురువారం ఉదయం పిఎస్సి5 ను ప్రారంభించిన భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణ ఈ కేంద్రంలోని బుకింగ్ కౌంటర్ ను పరిశీలించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఓ యాత్రికుడి పేరు నమోదు చేయడం ద్వారా టోకెన్ జారీచేసి లాంఛనంగా పీఏసీ ఫైవ్ ను ప్రారంభించారు. సీఎం నారా చంద్రబాబు వెంట ఆయన కొడుకు మంత్రి నారా లోకేష్, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్, టీటీడీ చైర్మన్ బి. నాయుడు, టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కూడా ఉన్నారు.
Tags:    

Similar News